గుత్తి కోటలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ భూమి పూజ పాల్గొన్న గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం
అనంతపురం బ్యూరో : గుత్తి పట్టణంలోని చారిత్రక గుత్తి కోటలో వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయ భూమి పూజ కార్యక్రమంలో గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు.
అనంతరం ఎమ్మెల్యే శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి, భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్వామివారి ఆలయ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సౌకర్యాలు కల్పించాలని సూచించారు. రానున్న రోజుల్లో ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గుత్తి పట్టణ, మండల కూటమి నాయకులు, కార్యకర్తలు, అనుబంధ కమిటీల సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.