BREAKING
బాల్య వివాహ రహితమే లక్ష్యం మూడు చింతలపల్లిలో ఘనంగా గాంధీ జయంతి ​కావలి వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు సూర్య' వార్తకు తక్షణ స్పందన: ప్రమాదకర విద్యుత్ స్తంభం మార్పిడి కదిరి క్రీడాకారులు క్రికెట్ సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలి. గ్రామీణ ప్రాంత ప్రతిభను వెలికితీయడమే ఆర్‌డీటీ లక్ష్యం- మచ్చా రామలింగారెడ్డి సత్యం.. అహింసే మార్గం.. గాంధీజీకి ఘన నివాళి గిరిజన గురుకుల పాఠశాలలో ఘనంగా గాంధీజీ 157వ జయంతి... అంగన్వాడీ కేంద్రాల్లో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు గాంధీజీ విగ్రహానికి ఘన నివాళులు... గాంధీజీ ఆశయాలే నేటితరానికి మార్గదర్శకం కావలిలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు వైరల్ రెడ్ కార్పెట్ మూమెంట్‌పై క్షమాపణలు చెప్పిన హాలీవుడ్ స్టార్ ఆన్ హాథవే.. అసలు ఏం జరిగిందంటే? గూడూరులో ఘనంగా జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలు తురకపల్లిలో ప్రపంచ ఉద్యాన కేంద్రం.. రాయలసీమ అభివృద్ధికి కీలక ముందడుగు రైతులకు ఆధునిక సాగు పద్ధతులు.. యువతకు ఉపాధి అవకాశాలు ఎన్టీఆర్ సామాజిక భరోసా పెన్షన్ల పంపిణీలో టౌన్ అధ్యక్షుడు గుమ్మడి సింహాద్రి....

ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించాలి

Select Suryaa Now
ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించాలి

ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించాలి

గాంధీ విగ్రహానికి కార్మిక సంఘం వినతి

భీమదేవరపల్లి, అక్టోబర్ 02 (మేజర్ న్యూస్ సూర్య):

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మండల కమిటీ నాయకులు డిమాండ్‌ చేశారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం గాంధీ విగ్రహానికి పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మండల కార్యదర్శి అజ్మీర బిక్షపతి మాట్లాడుతూ.. వి.బి.జి. రామ్‌జీ చట్టాన్ని రద్దు చేసి, ఉపాధి హామీ పథకాన్ని పటిష్ఠంగా అమలు చేయాలని కోరారు. పెండింగ్‌ బిల్లులను వెంటనే విడుదల చేయడంతో పాటు ఏడాదికి 200 రోజుల పని కల్పించాలని డిమాండ్‌ చేశారు. రోజువారీ కూలీని రూ.800కు పెంచాలని, కొత్త జాబ్‌కార్డులు జారీ చేయాలని కోరారు. పని ప్రదేశాల్లో కార్మికులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సంపత్‌, సురేష్‌, ఉప్పలయ్య, మల్లేశం, నందం తదితరులు పాల్గొన్నారు.