ఖానాపురంలో ఘనంగా గాంధీజీ జయంతి వేడుకలు
*ఖానాపురం, అక్టోబర్ 2, మేజర్ న్యూస్ సూర్య,మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం ఖానాపురం మండలంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు.
ఖానాపురం మండల పిఎసిఎస్ చైర్మన్, వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి వల్లే శ్రీనివాస్ యాదవ్, నర్సంపేట ఆత్మా చైర్మన్, ఖానాపురం గ్రామ పార్టీ అధ్యక్షులు ఎడ్ల భిక్షం రెడ్డి ఆధ్వర్యంలో గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
కార్యక్రమంలో పిఎసిఎస్ డైరెక్టర్లు బొబ్బ విద్యాసాగర్ రావు, లింగిడి వెంకటేశ్వర్లు, దేవినేని వేణుగోపాల్ రావు, బాలుగు లక్ష్మణ్, వార్డు సభ్యులు శాఖమూరి ముఖేష్ చౌదరి, తోటకూరి రాజు యాదవ్, సీనియర్ నాయకులు మండవ ప్రసాద్ రావు, రెడ్డి నాగార్జున రెడ్డి, మూడుపుల్ సింగ్, వల్లే రవి, బైటి రాజు, నాంచారి కుమారస్వామి, దాసి శ్రీనివాస్, రైతులు తదితరులు పాల్గొన్నారు.