BREAKING
కల్యాణలక్ష్మి–షాదీ ముబారక్‌ పథకాలకు 12 ఏళ్లు.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం. సల్మాన్ ఖాన్ ప్రస్తావనపై అలిగిన అర్బాజ్ ఖాన్.. ముంబై ఈవెంట్‌లో అసహనం హాలీవుడ్ ప్రీమియర్‌లో టమ్ క్రూయిజ్‌ను కలిసిన అవ్నీత్ కౌర్.. డిగర్ సినిమాపై ఆసక్తికర చర్చ కాలు కోల్పోయిన కూలికి మానవతా హస్తం టీమిండియా ఆటగాళ్లకు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు ఈ నెల 11 నుంచి 20 వరకు శరన్నవరాత్రి ఉత్సవాలు బీసీల రాజకీయ ప్రాతినిధ్యాన్ని అడ్డుకుంటున్నది వైసీపీనే ఎమ్మెల్యే పరిటాల సునీత విమర్శ కురుగుంట అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ఉచిత కంటి వైద్య శిబిరం రెేపు గన్నవరంలో విద్యుత్ సరఫరా నిలిపివేత.. 57 కేజీల విభాగంలో స్వర్ణ పతకం సాధించిన అమన్ సెహ్రావత్ అక్టోబర్ 9న తెలుగులో ‘హనుమాన్ అంశ్’ విడుదల.. హోంబలే ఫిల్మ్స్ ద్వారా గ్రాండ్ థియేట్రికల్ ఎంట్రీ రాజీవ్ ఆరోగ్యశ్రీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా అశోక్ ఎమ్ ఎస్ గ్లోబల్ ట్రేడర్స్ సంస్థను తనిఖీ చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆది పినిశెట్టి ‘మరకతమణి 2’ షూటింగ్ పూర్తి.. పోస్ట్ ప్రొడక్షన్ పనులతో జోరు ధర్మవరంలో ప్రభుత్వ ఐటీఐ, మహిళా డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలి విద్య కోసం విద్యార్థుల వలసలకు అడ్డుకట్ట వేయాలి పీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు మంజుల నరేంద్ర డిమాండ్

పామూరు మేజర్ పంచాయతీ సర్పంచ్ రేసులో యాదాల వెంకట సాయి కిరణ్

Select Suryaa Now
పామూరు మేజర్ పంచాయతీ సర్పంచ్ రేసులో యాదాల వెంకట సాయి కిరణ్
  • తల్లిదండ్రుల ప్రజాసేవా వారసత్వం.. ఉప సర్పంచ్‌గా అనుభవం

- మేజర్ పంచాయతీ సర్పంచ్‌గా పోటీ చేయాలని నాయకులు, కార్యకర్తల ఆకాంక్ష

- ప్రజలతో మమేకం సర్పంచ్ అభ్యర్థిగా సాయి కిరణ్‌కు పెరుగుతున్న ఆదరణ

పామూరు, మేజర్ న్యూస్ : 

పామూరు మేజర్ పంచాయతీ సర్పంచ్ పదవికి టిడిపి యువ నాయకుడు  యాదాల వెంకట సాయి కిరణ్ పేరు బలంగా వినిపిస్తుంది. ఉప సర్పంచ్‌గా పనిచేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందించిన అనుభవంతో పాటు ఆయన తండ్రి మాజీ ఎంపీపీ వై.వి. శేషారావు, తల్లి మాజీ సర్పంచ్ అనురాధలకు ఉన్న ప్రజా సేవానుభవం సాయి కిరణ్‌కు ప్రత్యేక బలంగా నిలుస్తుందని స్థానికంగా భావిస్తున్నారు. కుటుంబం నుంచి వచ్చిన ప్రజాసేవా వారసత్వాన్ని కొనసాగిస్తూ ఉప సర్పంచ్‌గా తనదైన ముద్ర వేసుకున్న సాయి కిరణ్ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్‌గా పోటీ చేయాలని పంచాయతీ పరిధిలోని నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కోరుకుంటున్నట్లు సమాచారం. యాదాల వెంకట సాయి కిరణ్ తండ్రి వై.వి. శేషారావు మాజీ ఎంపీపీగా, తల్లి అనురాధ మేజర్ పంచాయతీ సర్పంచ్‌గా ప్రజలకు సేవలందించారు. వారి అనుభవాలను దగ్గరగా చూస్తూ ప్రజా జీవితంలో ముందుకు వచ్చిన సాయి కిరణ్ ప్రస్తుతం ఉప సర్పంచ్‌గా బాధ్యతలు నిర్వహించారు.ప్రజా సమస్యలపై స్పందిస్తూ అందరికీ అందుబాటులో ఉండే నాయకుడిగా కొనసాగుతున్న ఆయన మేజర్ పంచాయతీ సర్పంచ్‌గా పోటీ చేయాలని పలువురు నాయకులు, కార్యకర్తలు కోరుకుంటున్నట్లు తెలుస్తుంది. ఉప సర్పంచ్‌గా పనిచేసిన అనుభవం, తండ్రి మాజీ ఎంపీపీగా, తల్లి మాజీ సర్పంచ్‌గా పనిచేసిన అనుభవాలు యాదాల వెంకట సాయి కిరణ్‌కు ప్రజలతో మమేకం కావడంలో ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న సాయి కిరణ్ పామూరు మేజర్ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా ముందుకు రావాలని పలువురు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. ప్రజల సమస్యలను తన సమస్యలుగా భావిస్తూ ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ అవసరమైన సమయంలో అండగా నిలిచే స్వభావం యాదాల వెంకట సాయి కిరణ్‌కు ప్రజల్లో ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది. తల్లిదండ్రుల నుంచి వచ్చిన ప్రజాసేవా విలువలను కొనసాగిస్తూ యువతను కలుపుకుని ముందుకు సాగుతున్న సాయి కిరణ్ పామూరు మేజర్ పంచాయతీ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం మరింత బాధ్యతతో పనిచేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నట్లు ఆయన సన్నిహితులు తెలిపారు.