కల్యాణలక్ష్మి–షాదీ ముబారక్ పథకాలకు 12 ఏళ్లు.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం.
కల్యాణలక్ష్మి–షాదీ ముబారక్ పథకాలకు 12 ఏళ్లు.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం.
కేసీఆర్ పథకాలు ప్రజల గుండెల్లో.. కాంగ్రెస్ హామీలు కాగితాలపైనేనా..?
హామీలే తప్ప అమలు లేదు..” హామీలతో గద్దెనెక్కి.. పథకాలను మరిచారు!..
కాంగ్రెస్ ప్రభుత్వంపై చింతా ప్రభాకర్ తీవ్రస్థాయిలో ఫైర్.
“*ఇది పాలన కాదు.. విధ్వంసానికి తొలి మెట్టు”* రేవంత్ సర్కార్‌పై చింతా ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు
సంగారెడ్డి ; కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, మాజీ సీఎం కేసీఆర్ చిత్రపటానికి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ పాలాభిషేకం చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ప్రశంసలు కురిపించారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ పథకాలను కేసీఆర్ అమలు చేశారని అన్నారు. ముఖ్యంగా పేదింటి ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టారని పేర్కొన్నారు.కేసీఆర్ సుపరిపాలనను చూసి ప్రజలు ఆకర్షితులయ్యారని, అయితే ప్రస్తుత రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని చింతా ప్రభాకర్ విమర్శించారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌తో పాటు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ హామీని నెరవేర్చలేదని ఆరోపించారు.ప్రస్తుత ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో విధ్వంసం జరుగుతోందని ఎమ్మెల్యే విమర్శించారు. ప్రజలు మళ్లీ కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని, కేసీఆర్‌తోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని ప్రజలు భావిస్తున్నారని అన్నారు. రానున్నది బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని పేర్కొన్నారు.కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా గత 12 ఏళ్లలో లక్షలాది కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిందని, ఈ పథకాల ద్వారా పేద కుటుంబాలకు అండగా నిలిచిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని చింతా ప్రభాకర్ అన్నారు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాల ద్వారా 12 ఏళ్లలో 16.78 లక్షల కుటుంబాలు లబ్ధి పొందాయి అని అన్నారు.కార్యక్రమంలో మాజీ సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, డాక్టర్ శ్రీహరి, ఎస్‌కే రషీద్, మల్ల గౌడ్, మాజీ జడ్పీటీసీ కొండల్‌రెడ్డి, చిల్వేరి ప్రభాకర్, వేణుగోపాలస్వామి, మండల పార్టీ అధ్యక్షులు చక్రపాణి, విఠల్, మధుసూదన్‌రెడ్డి, కౌన్సిలర్లు కొత్తపల్లి నాని, జలంధర్, పొన్న దశరథ్‌రెడ్డి, నాయికోటి నవీన్, శ్రీకాంత్, జాఫర్, నాయకులు శ్రావణ్‌రెడ్డి, రాజేందర్‌నాయక్, గోవర్ధన్‌రెడ్డి, రుక్మోద్దీన్, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.