BREAKING
ఓటీటీకి వచ్చేసిన మలయాళ సెన్సేషనల్ క్రైమ్ థ్రిల్లర్... బాక్సాఫీస్ వద్ద రూ.50 కోట్లు వసూలు చేసిన సినిమా స్ట్రీమింగ్ ఎప్పుడంటే కూటమి హామీలన్నీ నీటి మూటలే.. ప్రజలకు వాస్తవాలు వివరించాలి. స్థానిక ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలి: తన్నీరు నాగేశ్వరరావు పార్టీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ దేవర చుట్టమల్లే ఏఐ మార్ఫింగ్ వీడియోపై కుష్బూ సుందర్ తీవ్ర ఆగ్రహం.. మహిళల గౌరవం ఆటవస్తువు కాదంటూ ఘాటు వ్యాఖ్యలు ఎన్నికల సంఘం స్వతంత్ర తను కాపాడా లి ఎస్ ఐ ఆర్ ప్రక్రియ ను నిలిపివేయాలి... సీపీఐ - సిపిఎం… ఎన్నికల సంఘం స్వతంత్రతను కాపాడాలి నేడు గార్లకు రానున్న ఎమ్మెల్యే కోరం కనకయ్య కార్నెల్ విశ్వవిద్యాలయ సామూహిక అత్యాచార బాధితురాలికి బెదిరింపులు రెడ్‌క్రాస్‌ జిల్లా చైర్మన్‌గా డాక్టర్‌ ఎస్‌.ఎం. రాజేశ్వర్‌రావు స్థానిక ఎన్నికలకు వైఎస్సార్‌సీపీ సన్నద్ధం పెనుగంచిప్రోలులో పార్టీ శ్రేణులకు సభ్యత్వ కార్డుల పంపిణీ ఏఐ మార్ఫింగ్ వీడియోలపై జాన్వీ కపూర్ ఆవేదన: అనుమతి లేకుండా మహిళల చిత్రాలతో కల్పిత కంటెంట్ లైంగిక దాడికి సమానమని వ్యాఖ్య, ఎన్టీఆర్, చిరంజీవికి కృతజ్ఞతలు రాంపల్లి మరో జవహర్‌నగర్‌గా మారొద్దు.. ! సెంట్రల్ అమెరికన్ పార్లమెంట్ నుంచి తప్పుకుంటున్నట్లు నికరాగ్వా సంచలన ప్రకటన బీసీల హక్కుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది... నాగండ్లలో నేత్రదానం కుమ్మరి సంఘ భవన నిర్మాణానికి సంపూర్ణ సహకారం అందజేస్తాము* నాగండ్ల లో నేత్రదానం

ఆరోగ్యవంతమైన సమాజంలో వైద్యులు భాగం కావాలి

Select Suryaa Now
ఆరోగ్యవంతమైన సమాజంలో వైద్యులు భాగం కావాలి

 - ఏపీ ఆర్ ఎస్ ఎస్ డి ఐ వర్క్ షాపులో ఎమ్మెల్యే దామచర్ల విజ్ఞప్తి.

ఒంగోలు, మేజర్ న్యూస్  :

:ఆరోగ్యవంతమైన సమాజం కోసం వైద్యులు తమ వంతు సహకారం అందించాలని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు కోరారు. ఏ పి ఆర్ ఎస్ ఎస్ డి ఐ  - 2026 కాన్ఫరెన్స్ లో ఎమ్మెల్యే విశిష్ట అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సమాజంలో వైద్యులకు ఎంతో విలువ, గౌరవం ఉన్నాయన్నారు. మీరు అందించే సూచనలు క్షేత్ర స్థాయిలోకి వెళితే ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతంగా ఉంటారన్నారు. 90 ఏళ్లు దాటిన వారిలో డయాబెటిస్, బిపి వంటివి లేకుండా ఆరోగ్యంగా ఉంటున్నారని,  ప్రస్తుత కాలంలో 15 ఏళ్ల పిల్లల్లో కూడా డయాబెటిస్ ఉంటుందన్నారు. ఇలాంటి సెమినార్ ల ద్వారా చిన్న వయస్సులో వచ్చే దీర్ఘకాలిక సమస్యలను నిలువరించేందుకు చర్చించి ఆ దిశగా చర్యలు తీసుకోవాలని దామచర్ల జనార్దన్ రావు సూచించారు.

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఎన్ సి డి సి డి కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి తమ వైద్య బృందాలు వెళ్ళి బిపి, షుగర్, క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు చెప్పారు. వైద్యం ఒక్కటే కాకుండా ఆహార అలవాట్లు, వ్యాయామం చేయడం ద్వారా కొన్ని రకాల వ్యాధులకు దూరంగా ఉండే అవకాశం ఉంటుందన్నారు. 

ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య మాట్లాడుతూ ఒంగోలులో ఆర్ ఎస్ ఎస్ డి ఐ ద్వారా మంచి వర్క్ షాప్ జరిగినట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు నుండి ఎంతో అనుభవం కలిగిన వైద్యులు పాల్గొని విలువైన సూచనలు చేశారన్నారు. ప్రతి ఒక్కరూ ఆర్ ఎస్ ఎస్ డి ఎస్ లో మెంబర్ షిప్ తీసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఏ పీ ఆర్ ఎస్ ఎస్ డి ఎస్ ప్రెసిడెంట్ వెంకటరమణరెడ్డి, ఆల్ ఇండియా ఈ సి మెంబర్ విజయ్ కుమార్, ఏపీ ఏం సి వైస్ ఛైర్మన్ సుబ్బానాయుడు,  అబ్జర్వర్ జయశేఖర్ తదితరులు పాల్గొన్నారు.