నాటుసారా స్వాధీనం ఇద్దరు అరెస్ట్.. వాహనాలు సీజ్
జంగారెడ్డిగూడెం,-మేజర్ న్యూస్,కుక్కునూరు మండలం వేలేరు గ్రామ శివారులోని చెక్‌పోస్టు వద్ద ఎక్సైజ్ ఎన్ఫోర్స్‌మెంట్ అధికారులు ఆదివారం తెల్లవారుజామున నిర్వహించిన వాహన తనిఖీల్లో 40 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నట్లు జంగారెడ్డిగూడెం ఎక్సైజ్ సీఐ శ్రీనుబాబు ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలోని బూర్గంపహాడ్ నుంచి వస్తున్న ఆటో,ద్విచక్ర వాహనంలో అక్రమంగా తరలిస్తున్న నాటుసారాను గుర్తించి వాహనాలను సీజ్ చేసినట్లు తెలిపారు.ఈ ఘటనకు సంబంధించి వేలేరు గ్రామానికి చెందిన భూక్యా బాలు, బోడ నరసింహపై కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.