ఎమ్ ఎస్ గ్లోబల్ ట్రేడర్స్ సంస్థను తనిఖీ చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు
ఎమ్ ఎస్ గ్లోబల్ ట్రేడర్స్ సంస్థను తనిఖీ చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు
సంగారెడ్డి : శనివారం నాడు టీజీ సేఫ్ అధికారులు పి. అమృత, అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్, మరియు కె. రాజేశ్వర్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ కలిసి సంగారెడ్డి పట్టణంలోని నాల్సాబ్‌గడ్డ కాలనీలో ఉన్న ఎమ్ ఎస్ గ్లోబల్ ట్రేడర్స్ సంస్థను తనిఖీ చేశారు.
తనిఖీ సందర్భంగా అధికారులు క్రింది ఉల్లంఘనలను గుర్తించారు:
సదరు ఎఫ్ బి ఓ సోయాబీన్ ఆయిల్‌ను “ హెల్త్ ప్లేస్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ ” పేరుతో రీప్యాకింగ్ చేసి విక్రయిస్తున్నట్లు గుర్తించారు.రీప్యాకింగ్ చేస్తున్న ఎడిబుల్ ఆయిల్ నాణ్యతను పరీక్షించేందుకు అవసరమైన ఇన్-హౌస్ ల్యాబొరేటరీ సదుపాయం సంస్థలో అందుబాటులో లేదు.రీప్యాక్ చేసిన ఆయిల్‌కు సంబంధించి అవసరమైన రికాల్ మెకానిజం (ఉత్పత్తిని వెనక్కి తీసుకునే విధానం) సంస్థలో అందుబాటులో లేదు.
పై ఉల్లంఘనలతో పాటు ఎడిబుల్ ఆయిల్‌కు సంబంధించి కల్తీ/తప్పుడు బ్రాండింగ్‌కు సంబంధించిన అనుమానాలు ఉన్న నేపథ్యంలో, సదరు ఎఫ్ బి ఓ యొక్క ఎఫ్ ఎస్ ఎస్ ఎ ఐ లైసెన్స్‌ను తాత్కాలికంగా సస్పెండ్ చేసి, ఆయిల్ రీప్యాకింగ్ కార్యకలాపాలను నిలిపివేశారు.అదనంగా, వివిధ రకాల 3 ఎడిబుల్ ఆయిల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ శాంపిళ్లను సేకరించి, ప్రయోగశాల పరీక్షల నిమిత్తం ఫుడ్ ల్యాబొరేటరీకి పంపించారు.
ప్రయోగశాల పరీక్షల నివేదికలు అందిన అనంతరం, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006 మరియు దాని కింద రూపొందించిన నిబంధనలు/రెగ్యులేషన్ల ప్రకారం తదుపరి చర్యలు తీసుకోబడతాయి.