BREAKING
తొలి సినిమాపై శ్రుతి హాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు, నాన్న కోసమే ఆ నటన అంటున్న నటి ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మను కలసి సన్మానించిన నసనకోట ఎం జె పి విద్యా కమిటీ చైర్మన్ సౌజన్య ఎస్‌ఎస్‌ రాజమౌళి వారణాసి సినిమా షూటింగ్ అప్‌‌డేట్, రికార్డు వేగంతో జక్కన్న ప్రాజెక్ట్ ఓటీటీకి వచ్చేసిన మలయాళ సెన్సేషనల్ క్రైమ్ థ్రిల్లర్... బాక్సాఫీస్ వద్ద రూ.50 కోట్లు వసూలు చేసిన సినిమా స్ట్రీమింగ్ ఎప్పుడంటే కూటమి హామీలన్నీ నీటి మూటలే.. ప్రజలకు వాస్తవాలు వివరించాలి. స్థానిక ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలి: తన్నీరు నాగేశ్వరరావు పార్టీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ దేవర చుట్టమల్లే ఏఐ మార్ఫింగ్ వీడియోపై కుష్బూ సుందర్ తీవ్ర ఆగ్రహం.. మహిళల గౌరవం ఆటవస్తువు కాదంటూ ఘాటు వ్యాఖ్యలు ఎన్నికల సంఘం స్వతంత్ర తను కాపాడా లి ఎస్ ఐ ఆర్ ప్రక్రియ ను నిలిపివేయాలి... సీపీఐ - సిపిఎం… ఎన్నికల సంఘం స్వతంత్రతను కాపాడాలి నేడు గార్లకు రానున్న ఎమ్మెల్యే కోరం కనకయ్య కార్నెల్ విశ్వవిద్యాలయ సామూహిక అత్యాచార బాధితురాలికి బెదిరింపులు రెడ్‌క్రాస్‌ జిల్లా చైర్మన్‌గా డాక్టర్‌ ఎస్‌.ఎం. రాజేశ్వర్‌రావు స్థానిక ఎన్నికలకు వైఎస్సార్‌సీపీ సన్నద్ధం పెనుగంచిప్రోలులో పార్టీ శ్రేణులకు సభ్యత్వ కార్డుల పంపిణీ ఏఐ మార్ఫింగ్ వీడియోలపై జాన్వీ కపూర్ ఆవేదన: అనుమతి లేకుండా మహిళల చిత్రాలతో కల్పిత కంటెంట్ లైంగిక దాడికి సమానమని వ్యాఖ్య, ఎన్టీఆర్, చిరంజీవికి కృతజ్ఞతలు రాంపల్లి మరో జవహర్‌నగర్‌గా మారొద్దు.. ! సెంట్రల్ అమెరికన్ పార్లమెంట్ నుంచి తప్పుకుంటున్నట్లు నికరాగ్వా సంచలన ప్రకటన బీసీల హక్కుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది...

ఏపీని టెక్నాలజీ హబ్‌గా మార్చడమే లక్ష్యం

Select Suryaa Now
ఏపీని టెక్నాలజీ హబ్‌గా మార్చడమే లక్ష్యం

-పాన్‌ ఐఐటీ సమ్మిట్‌లో సీఎం చంద్రబాబు స్పెషల్‌ ఫోకస్‌

-స్టార్టప్‌లు.. ఆవిష్కరణలకు ప్రభుత్వం అండగా ఉంటుందని వెల్లడి

-డ్రోన్‌ నుంచి ఈవీ కన్వర్షన్‌ వరకు.. వినూత్న ప్రాజెక్టులపై ఆరా

-గంటల్లో పెట్రోల్‌ టూవీలర్‌ ఈవీగా మార్పు.. ఏపీలో ప్రాజెక్టుకు సీఎం ఆదేశం

-ముఖం స్కాన్‌తో నిమిషాల్లో హెల్త్‌ రిపోర్ట్‌.. యాప్‌పై సీఎం ఆసక్తి

-స్వర్ణాంధ్ర-10పై చిన్నారుల ప్రజెంటేషన్‌కు చంద్రబాబు ప్రశంసలు

-యువత.. ఐఐటీయన్ల ఆలోచనలకు ప్రోత్సాహం.. టెక్నాలజీతో రాష్ట్ర అభివృద్ధికి బాట

-పాన్ ఐఐటీ సమ్మిట్‌లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

ఏపీ స్టేట్ బ్యూరో, అమరావతి :

ఆంధ్రప్రదేశ్‌ను టెక్నాలజీ, ఆవిష్కరణలు, స్టార్టప్‌లకు దేశంలోనే కీలక హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్ర అభివృద్ధిలో సాంకేతికతను విస్తృతంగా వినియోగించడంతో పాటు.. యువత, ఐఐటీయన్లు, స్టార్టప్‌ల వినూత్న ఆలోచనలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని సీఎం స్పష్టం చేశారు.విజయవాడలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ స్మృతివనం కళావేదికలో శనివారం నిర్వహించిన పాన్‌ ఐఐటీ సమ్మిట్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సమ్మిట్‌ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వివిధ స్టార్టప్‌లు, ఐఐటీయన్ల నూతన ఆవిష్కరణల స్టాళ్లను సీఎం ఆసక్తిగా సందర్శించారు. ఆయా ప్రాజెక్టుల పనితీరు, వాటి ద్వారా ప్రజలకు, రాష్ట్ర అభివృద్ధికి కలిగే ప్రయోజనాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు.

డ్రోన్‌పై సీఎం సంతకం..

పాన్‌ ఐఐటీ సమ్మిట్‌లో భాగంగా ఏర్పాటు చేసిన ఆక్సి ఏరోస్పేస్‌ సంస్థ స్టాల్‌ను సీఎం చంద్రబాబు సందర్శించారు. సంస్థ రూపొందించిన అత్యాధునిక డ్రోన్‌ను పరిశీలించి.. దాని పనితీరు, వినియోగం, భవిష్యత్‌ అవకాశాలపై ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధుల కోరిక మేరకు డ్రోన్‌పై సీఎం చంద్రబాబు తన సంతకం చేసి వారిని ప్రోత్సహించారు.అనంతరం వివిధ స్టార్టప్‌లు, ఐఐటీయన్లు రూపొందించిన వినూత్న సాంకేతిక పరిజ్ఞానాలను సీఎం పరిశీలించారు. యువతలో ఉన్న సృజనాత్మకతను సరైన విధంగా వినియోగిస్తే రాష్ట్ర అభివృద్ధికి టెక్నాలజీ ప్రధాన చోదకశక్తిగా మారుతుందని సీఎం అభిప్రాయపడ్డారు.

గంటల్లోనే టూవీలర్‌ ఈవీగా మార్పు..

సమ్మిట్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన పెట్రోల్‌తో నడిచే ద్విచక్ర వాహనాలను కేవలం గంటల వ్యవధిలో ఎలక్ట్రిక్‌ వాహనాలుగా మార్చే సాంకేతికతను సీఎం చంద్రబాబు పరిశీలించారు. సాధారణ పెట్రోల్‌ వాహనాలను ఈవీలుగా ఎలా మారుస్తారు? అందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం ఏమిటి? మార్పిడి ప్రక్రియకు ఎంత సమయం పడుతుంది? అనే అంశాలను సంస్థ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఈవీ కన్వర్షన్‌ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగాన్ని పెంచడం, కాలుష్యాన్ని తగ్గించడం, కొత్త టెక్నాలజీ ఆధారిత పరిశ్రమలకు ప్రోత్సాహం కల్పించడం ద్వారా ఏపీని భవిష్యత్‌ టెక్నాలజీ కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతున్నట్లు సీఎం సంకేతాలిచ్చారు.

ముఖం స్కాన్‌ చేస్తే.. నిమిషాల్లో హెల్త్‌ రిపోర్ట్‌!

టెక్నాలజీ ఆధారిత ఆరోగ్య సేవలపై కూడా సీఎం ప్రత్యేక ఆసక్తి కనబరిచారు. ముఖాన్ని స్కాన్‌ చేయడం ద్వారా నిమిషాల వ్యవధిలో ప్రాథమిక ఆరోగ్య నివేదికను అందించే హెల్త్‌ యాప్‌ను రూపొందించిన సంస్థ స్టాల్‌ను చంద్రబాబు సందర్శించారు.యాప్‌ ఎలా పనిచేస్తుంది? ముఖాన్ని స్కాన్‌ చేసిన తర్వాత ఎలాంటి ఆరోగ్య వివరాలను గుర్తించగలుగుతుంది? ప్రాథమిక ఆరోగ్య నివేదికను ఎంత సమయంలో అందిస్తుంది? వంటి వివరాలను సంస్థ ప్రతినిధులను సీఎం అడిగి తెలుసుకున్నారు. టెక్నాలజీని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ఆరోగ్య సేవల్లో వేగం, సౌలభ్యం పెంచే అవకాశాలపై ఆయన ఆసక్తి చూపించారు.

స్వర్ణాంధ్ర-10పై చిన్నారుల అదిరిపోయే ప్రజెంటేషన్‌

పాన్‌ ఐఐటీ సమ్మిట్‌లో చిన్నారులు ఇచ్చిన ప్రజెంటేషన్‌ కూడా సీఎం చంద్రబాబును ఆకట్టుకుంది. ‘స్వర్ణాంధ్ర-10 సూత్రాల’ అమలులో టెక్నాలజీని ఎలా వినియోగించాలి? రాష్ట్ర అభివృద్ధిలో సాంకేతికతను మరింత సమర్థవంతంగా ఎలా ఉపయోగించుకోవాలి? అనే అంశాలపై చిన్నారులు తమ ఆలోచనలను సీఎంకు ప్రజెంట్‌ చేశారు.చిన్నారుల ఆలోచనలను ఆసక్తిగా విన్న చంద్రబాబు.. వారి ప్రజెంటేషన్‌ను అభినందించారు. భవిష్యత్‌ తరాల్లో చిన్న వయస్సు నుంచే టెక్నాలజీపై ఆసక్తి, ఆవిష్కరణలపై ఆలోచన పెంపొందించడం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. అనంతరం చిన్నారులతో కలిసి సీఎం చంద్రబాబు ఆప్యాయంగా గ్రూప్‌ ఫొటో దిగారు.

యువత ఆలోచనలకు ప్రభుత్వం అండగా..

రాష్ట్ర అభివృద్ధి లక్ష్యాలను సాధించడంలో టెక్నాలజీ కీలక పాత్ర పోషించాల్సి ఉందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. యువత, ఐఐటీయన్లు, స్టార్టప్‌ సంస్థలు రూపొందించే వినూత్న ఆవిష్కరణలకు ప్రభుత్వం అవసరమైన సహకారం అందిస్తుందని తెలిపారు.పాన్‌ ఐఐటీ సమ్మిట్‌ వేదికగా ఏపీని ఆవిష్కరణలకు అనుకూలమైన రాష్ట్రంగా, స్టార్టప్‌లకు కేంద్రంగా, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి హబ్‌గా తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ సంకల్పాన్ని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. రాష్ట్రంలో కొత్త టెక్నాలజీ ఆధారిత పరిశ్రమలు, స్టార్టప్‌లు ఏర్పాటయ్యేలా ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించడంతో పాటు.. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే ఆవిష్కరణలకు ప్రాధాన్యత ఇస్తుందని వెల్లడించారు.