BREAKING
పర్యాటక రంగాన్ని కీలక ఆదాయ వనరుగా తీర్చిదిద్దాలి: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నకిలీ పాస్ పుస్తకాలకు ఇక చెక్ బాపట్ల జాయింట్ కలెక్టర్ భావన వెల్లడి చట్టాలపై భయం వీడి అవగాహన పెంచుకోవాలి : జూనియర్ సివిల్ జడ్జి కె. అవినాష్ ఉపముఖ్యమంత్రి, మంత్రులను మర్యాదపూర్వకంగా కలిసిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఆపరేషన్ త్రిశూల్‌లో భాగంగా మార్కాపురంలో అవగాహన ర్యాలీ దేవరగట్టున సందర్శించిన ఆర్ డి ఓ కిస్తారెడ్డిపేట్, పటేల్‌గూడలో సీసీ రోడ్లు మంజూరు చేయాలి కేఎస్ఎస్ సభ్యులకు రివ్యూ సమావేశం కళ్యాణం తంతులో మాంగల్య ధారణ చూపిస్తున్న పూజారి క్యాంపస్ లో నో డ్రగ్స్...నో ర్యాగింగ్... బిసి లకు అండగా టీడీపీ పదేళ్లలో భారత్ అభివృద్ధి చెందిన దేశంగా ఎదుగుతుంది, పాన్‌ఐఐటీ సమ్మిట్‌లో మంత్రి లోకేశ్, ఏపీ అభివృద్ధికి "3ఎస్" మంత్రం భైరవకోనలో పాఠశాల విద్యార్థుల సందడి ప్రజలకు మెరుగైన తాగునీటి వసతుల కల్పనే లక్ష్యం:ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి కనిగిరి,మేజర్ న్యూస్ :ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు, స్వచ్ఛమైన తాగునీటిని అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా కనిగిరి మున్సిపాలిటీ పరిధిలో కొనసాగుతున్న ఇంటింటికి తాగునీటి పైప్‌లైన్ పనులను ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు రెడ్ క్రాస్ ఎలక్షన్స్ వాయిదా : జిల్లా అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి

నకిలీ పత్రాలతో భూకబ్జాయత్నం

Select Suryaa Now
నకిలీ పత్రాలతో భూకబ్జాయత్నం

సూర్య ఆదిలాబాద్ ప్రతినిధి:పట్టణంలోని భుక్తాపూర్ ప్రాంతంలో భూమిని అక్రమంగా కబ్జా చేసేందుకు నకిలీ పత్రాలు సృష్టించి మోసానికి పాల్పడ్డారనే ఫిర్యాదుపై ఆదిలాబాద్ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టడం జరిగిందని వన్టౌన్ సీఐ బి సునీల్ కుమార్ తెలిపారు.
ఫిర్యాదుదారు లక్ష్మణ్ సాంఖ్లా తెలిపిన వివరాల ప్రకారం.. భుక్తాపూర్ ప్రాంతంలో సర్వే నంబర్ 119లో 50 చదరపు గజాల ఖాళీ స్థలం తనకు వారసత్వంగా వచ్చిందని, 2012లో రిజిస్టర్ అయిన పార్టిషన్ డీడ్ ద్వారా తనకు హక్కులు లభించాయని, అప్పటి నుంచి ఆ స్థలాన్ని తన ఆధీనంలో ఉంచుకుని వినియోగిస్తున్నట్లు తెలిపారు.
తన భూమిని ఆక్రమించే ఉద్దేశంతో అజర్ అహ్మద్ ఖాన్, సయ్యద్ హబీబ్, సయ్యద్ నజీర్ పరస్పరం కుమ్మక్కై, తన భూమికి సంబంధం లేని పత్రాలను సృష్టించి తమకు హక్కులు ఉన్నట్లు చూపించే ప్రయత్నం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
గిఫ్ట్ సెటిల్‌మెంట్ డీడ్, అగ్రిమెంట్ ఆఫ్ సేల్ కమ్ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ, అనంతరం సేల్ డీడ్ వంటి మూడు పత్రాలను సృష్టించి, వాటి ఆధారంగా తన భూమిని ఆక్రమించి తనను అక్కడి నుంచి ఖాళీ చేయించే ప్రయత్నం చేస్తున్నారని ఫిర్యాదుదారు ఆరోపించారు.ఫిర్యాదులో పేర్కొన్న అంశాల ఆధారంగా ఆదిలాబాద్ 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి, సంబంధిత పత్రాలు, భూమి హక్కులు, పత్రాల నిజానిజాలు మరియు ఘటనకు సంబంధించిన ఇతర అంశాలపై దర్యాప్తు చేస్తున్నారు.
ఈ కేసులో పత్రాల పరిశీలనతో పాటు చట్టపరమైన అన్ని అంశాలను పరిశీలించి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఆదిలాబాద్ 1 టౌన్ ఇన్‌స్పెక్టర్ బి. సునీల్ కుమార్ తెలిపారు.