BREAKING
కోనసీమ పర్యాటకాభివృద్ధికి ప్రభుత్వం కృతనిశ్చయం.. హరీష్ బాలయోగి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం 100 సంవత్సరాలు ఎంపీపీగా పదవీ విరమణ చేసిన గంగాభవాని.. వైఎస్ఆర్సిపి ఆత్మీయ సమ్మేళనం.. 19వ రోజుకు చేరిన వి .ఆర్.ఏల దీక్ పటిష్టమైన వృద్ధి అవకాశాలు, ఆధునిక మౌలిక వసతులు 19వ రోజుకు చేరిన వీఆర్ఏల నిరసన దీక్షలు: అరుణాచల క్షేత్రం (తిరువణ్ణామలై) – విశిష్టతలు, ఆధ్యాత్మిక ప్రాధాన్యత నేటి రాశి ఫలాలు: 5 అక్టోబర్ 2026, సోమవారం నేటి పంచాంగం: 5 అక్టోబర్ 2026, సోమవారం. 'జియోనిజం ఒక జాతి వివక్ష' అంటూ బ్రిటన్ గ్రీన్ పార్టీ తీర్మానం టెర్మినల్ టు యానం..అంతా మాఫియా ఈ నెల 5న ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఇరాన్ చమురు మంత్రి మొహ్సిన్ పాక్నెజాద్ రాజీనామా 'స్పేస్‌ఎక్స్ ఏఐ' పేరును 'స్పేస్‌ఎక్స్ ఎస్ఐ'గా మార్చనున్న ఎలన్ మస్క్ గణపతి నిమజ్జన కార్యక్రమంలో లడ్డూ వేలం పాటలో పాల్గొన్న బొడ్డేటి కిరణ్ కుమార్..

సింగరేణి కాంటాక్ట్ కార్మికులకు 10 శాతం లాభాల బోనస్ ప్రకటించాలి ఐఎఫ్టియు

Select Suryaa Now
సింగరేణి కాంటాక్ట్ కార్మికులకు 10 శాతం లాభాల బోనస్ ప్రకటించాలి ఐఎఫ్టియు

ఇల్లందు సూర్యా ప్రతినిధి : 

సింగరేణి కాంటాక్ట్ కార్మికులకు 10 శాతం లాభాల బోనస్ చెల్లించాలి 
- ఐఎఫ్టియు నాయకులు తోడేటి నాగేశ్వరరావు, ఎండి రాసుద్దీన్ 
ఇల్లందు రూరల్, సూర్యా మేజర్ న్యూస్ : సింగరేణి కాంటాక్ట్ కార్మికులకు 10 శాతం లాభాల బోనస్ చెల్లించాలని ఐ ఎఫ్ టి యు మోటార్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు తోడేటి నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి ఎం డి రాసుద్దిన్ lu డిమాండ్ చేశారు. శనివారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు పాల్గొని మాట్లాడుతూ.. సింగరేణిలో బొగ్గు రవాణా చేస్తున్న టిప్పర్ కార్మికులకు 10 శాతం లాభాల బోనస్ చెల్లించాలని, కోయగూడెం నుండి వివిధ ప్రాంతాలకు బొగ్గు రవాణా చేస్తున్న టిప్పర్ కార్మికులకు పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాల్సిన బాధ్యత టిప్పర్ యాజమాన్యాలపై ఉందన్నారు. వేతనాల పెరుగుదలకై భవిష్యత్తులో ఉద్యమ కార్యచరణకు ప్రణాళిక లు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. మల్లికార్జున రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో తెలంగాణ ప్రగతిశీల ఆటో అండ్ మోటార్ వర్కర్స్ జిల్లా ప్రధాన కార్యదర్శి డి మోహన్ రావు, జిల్లా నాయకులు డి. లాలు, అంజయ్య, రాజు లోత్, నరసయ్య తదితరులు పాల్గొన్నారు.

ఇల్లందు సూర్యా రూరల్ రిపోర్టర్ డానియల్