కళ్యాణం తంతులో మాంగల్య ధారణ చూపిస్తున్న పూజారి
యాదగిరి కొండ మేజర్ న్యూస్....
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీలక్ష్మి నరసింహ స్వామి వారి సన్నిధిలో శనివారం యాదాద్రి ఆలయ సన్నిధిలో భక్తులరద్దీ పెరిగింది.వేకువ జామున ఉదయాన్నే స్వామివారి దర్శనానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆలయానికి భక్తుల రద్దీ పెరగడంతో స్వామి వారి ధర్మ దర్శనంకు 2గంటల సమయం ప్రత్యేక ప్రవేశ దర్శనంకి ఒక గంట సమయంపడుతోంది. క్షేత్ర పరిసరాలు భక్తుల సందడి కనిపిస్తుంది. దర్శన క్యూలైన్లు,ఆలయ మాఢ వీధుల్లు,కళ్యాణకట్ట, పుష్కరిణి,కొండపైబస్టాండ్, వ్రత మండపం ఘాట్ రోడ్డు వెంట భక్తులతో కిటకిటలాడుతున్నవి.. ఆలయంలో స్వామివారి నిత్య కళ్యాణం పర్వంలో సువర్ణ పుష్పార్చన, వేద ఆశీర్వచనం భక్తులు పాల్గొని మొక్కులు చెల్లించుకుంటున్నారు.