చట్టాలపై భయం వీడి అవగాహన పెంచుకోవాలి : జూనియర్ సివిల్ జడ్జి కె. అవినాష్
నారాయణపేట, సూర్యన్యూస్:
నారాయణపేట జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం పట్టణంలో స్ఫూర్తి డిగ్రీ కళాశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య ఆదితిగా జూనియర్ సివిల్ జడ్జి కే. అవినాష్ హాజరై మాట్లాడారు. రాజ్యాంగం ద్వారాసమానత్వపు, స్వేచ్ఛా,, దోపిడీని అరికట్టే,, మత స్వేచ్ఛా, సాంస్కృతిక, రాజ్యాంగ పరిహారపు సంబంధించి 6 రకాల హక్కులు ఉన్నాయని చెప్పారు. అదే విధంగా భారత పౌరులుగా మనకు 11 విధులు కూడా ఉన్నాయని, దేశాన్ని, జాతీయ జెండాను గౌరవించాలని తెలిపారు. ఇక పిల్లలపై లైంగిక వేధింపులు జరిగితే అది తీవ్రమైన నేరమని అది ఫోక్సో చట్టం పరిధిలోకి వస్తుందన్నారు. చిన్న పిల్లలను తాకడం, చెడుగా మాట్లాడటం, ఫోటోలు తీయడం కూడా నేరమని చెప్పారు. ఈ కేసుల్లో కనీసం 20 ఏళ్ల జైలు శిక్ష నుండి జీవిత ఖైదు, అవసరమైతే మరణ శిక్ష వరకు పడుతుందని హెచ్చరించారు. సమాచారం 1098 హెల్ప్ లైన్ కి కాల్ చేయాలని సూచించారు. ఇక గంజాయి, డ్రగ్స్, మత్తు మందులు వాడటం, అమ్మడం, దాచడం నేరం. దీని కింద 10 నుండి 20 ఏళ్ల వరకు జైలు శిక్ష, రూ. 2 లక్షల వరకు జరిమానా ఉంటుందన్నారు. 14 ఏళ్ల లోపు పిల్లలతో హోటళ్లలో, ఇళ్లలో, పొలాల్లో పని చేయించడం నేరమని, పని చేయించే వారికి 2 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది తెలిపారు.
*పేదవారికి ఉచిత న్యాయ సహాయం : లక్ష్మిపతి గౌడ్*
లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ కె. లక్ష్మిపతి గౌడ్ మాట్లాడుతూ.. పేదవారికి, మహిళలకు, పిల్లలకు, వికలాంగులకు కోర్టులో ఉచితంగా లాయర్ ఇస్తారని, కేసు ఖర్చులన్నీ సంస్థ భరిస్తుందని తెలిపారు. సహాయం కోసం టోల్ ఫ్రీ నెంబర్ 15100 కు కాల్ చేయాలని సూచించారు. 18 ఏళ్ల లోపు అమ్మాయికి, 21 ఏళ్ల లోపు అబ్బాయికి పెళ్లి చేయడం నేరమని,. బాల్య వివాహం చేస్తే 2 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది. బాల్య వివాహాలను అందరూ అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. మీకు ఎలాంటి అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే చైల్డ్ హెల్ప్‌లైన్(1098), మహిళా హెల్ప్‌లైన్ (181), ఉచిత న్యాయ సహాయం (15100), అత్యవసర సేవ (112) తదితర హెల్ప్‌లైన్ నంబర్లకు సమాచారం ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో లైసన్ ఆఫీసర్ కృష్ణయ్య గౌడ్, పాఠశాల ప్రినిసిపాల్ పద్మ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
-- *రాజేష్ కుమార్, సూర్య రిపోర్టర్ నారాయణపేట.*