BREAKING
ఢిల్లీలోని పట్‌పర్‌గంజ్‌లో ఓటర్ల జాబితా పరిశీలన... రాజస్థాన్ పోలీసు దళంలోకి 438 మంది మహిళా కానిస్టేబుళ్లు.. దీక్షాంత్ పరేడ్‌లో కర్తవ్య ప్రమాణం శీతాకాల విమాన సర్వీసుల వేళ నవీ ముంబై ఎయిర్‌‌పోర్ట్ బహుళ రవాణా అనుసంధానం విస్తరణ కోనసీమ పోలీస్ శాఖలో నూతన డాగ్ కెన్నెల్ ప్రారంభం.. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అధికారులు సన్నద్ధం కావాలి :జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్.. అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి.. కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్.. నో యువర్ లీడర్’ సమనస జెడ్పీ హైస్కూల్ విద్యార్థిని భవ్య శ్రీ.. పరిమళ ప్రసాదం కొరత తీర్చేందుకు మెగా ప్రాజెక్టు ప్రజా సమస్యలపై అధికారులు ప్రత్యేక సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి..జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్.. 17వ డివిజన్‌లో అదరగొట్టిన ఫ్లాష్ మాబ్స్.. - విజయవాడ ఉత్సవ్ 2.0కు విస్తృత ప్రచారం ప్రతి ఫిర్యాదును క్షేత్రస్థాయిలో పరిశీలించి పూర్తిస్థాయిలో పరిష్కరించాలి సాంప్రదాయ విలువలను భావితరాలకు అందించాలి : మాజీ ఎమ్మెల్సీ వై.వి.బి. రాజేంద్రప్రసాద్ దసరా విశేష సేవల ఆన్‌లైన్ టికెట్లు విడుదల దసరా ఏర్పాట్లపై దేవాదాయ కమిషనర్ క్షేత్రస్థాయి పరిశీలన పేద కుటుంబాలకు అండగా నిలుస్తాం.. సమాజ సేవకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలి

తమిళనాడు బాలికల టైటిల్‌ నిలబెట్టుకుంది.. రాజస్థాన్‌దే బాలుర కిరీటం

Select Suryaa Now
తమిళనాడు బాలికల టైటిల్‌ నిలబెట్టుకుంది.. రాజస్థాన్‌దే బాలుర కిరీటం

తమిళనాడు బాలికల టైటిల్‌ నిలబెట్టుకుంది.. రాజస్థాన్‌దే బాలుర కిరీటం

విజయవాడ, అక్టోబర్ 4, మేజర్ న్యూస్ ప్రతినిధి (ప్రేమ్ రాజ్✍️) : ఆర్టీసీ కాలనీలోని మారిస్ స్టెల్లా కళాశాల ఇండోర్ స్టేడియంలో ఎనిమిది రోజులుగా జరిగిన 51వ సబ్ జూనియర్ జాతీయ బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌ ఆదివారం ఘనంగా ముగిసింది. బాలికల విభాగంలో తమిళనాడు 65–55తో మహారాష్ట్రను ఓడించి వరుసగా రెండోసారి జాతీయ టైటిల్‌ను కైవసం చేసుకోగా, బాలుర విభాగంలో రాజస్థాన్ 77–56తో డిఫెండింగ్ ఛాంపియన్ ఉత్తరప్రదేశ్‌ను ఓడించి కొత్త ఛాంపియన్‌గా నిలిచింది. బాలికల ఫైనల్లో ధన్యా ఎం. 19, వి. అన్షిక 13 పాయింట్లతో తమిళనాడు విజయంలో కీలకపాత్ర పోషించగా, మహారాష్ట్ర తరఫున మైత్రి షా 13 పాయింట్లు సాధించింది. బాలుర ఫైనల్లో రాజస్థాన్ తరఫున రోనిత్ ధంకా 19, దక్ష్ చౌదరి 18 పాయింట్లతో రాణించగా, ఉత్తరప్రదేశ్‌కు సాహిల్ కుమార్ 22, వంశ్ తోమర్ 10 పాయింట్లు సాధించారు. బాలికల కాంస్య పతక పోరులో ఉత్తరప్రదేశ్ 65–49తో కర్ణాటకను, బాలుర విభాగంలో హర్యానా 60–54తో మహారాష్ట్రను ఓడించాయి. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాల నుంచి క్రీడాకారులు పాల్గొన్న ఈ పోటీలను బాస్కెట్‌బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, బాస్కెట్‌బాల్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ సంయుక్తంగా నిర్వహించాయి. విజేతలకు రూ.3 లక్షలు, రన్నరప్‌కు రూ.2 లక్షలు, కాంస్య పతక విజేతలకు రూ.1 లక్ష చొప్పున నగదు బహుమతులు అందజేశారు. టోర్నమెంట్ అత్యుత్తమ క్రీడాకారులుగా తమిళనాడుకు చెందిన ధన్యా ఎం., రాజస్థాన్‌కు చెందిన రజత్ వ్యాస్ ఎంపికయ్యారు. ఉత్తమ మూడు పాయింట్ల షూటర్లుగా నేత్ర దామ్కే, శరద్ కుమార్ నిలిచారు. ముగింపు కార్యక్రమంలో ఎంపీ జి.ఎం. హరీష్ బాలయోగి, మాజీ ఎంపీ అల్లొల ఇంద్రకరణ్ రెడ్డి, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ, ఏపీ క్రీడా ప్రాధికార సంస్థ ఉపాధ్యక్షురాలు, మేనేజింగ్ డైరెక్టర్ ఎస్. భారణి, ఆదాయపు పన్ను శాఖ కమిషనర్ సౌమ్య మిశ్రా, విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ హెచ్.ఎం. ధ్యానచంద్ర తదితరులు పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు.