ప్రజలకు మెరుగైన తాగునీటి వసతుల కల్పనే లక్ష్యం:ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి కనిగిరి,మేజర్ న్యూస్ :ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు, స్వచ్ఛమైన తాగునీటిని అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా కనిగిరి మున్సిపాలిటీ పరిధిలో కొనసాగుతున్న ఇంటింటికి తాగునీటి పైప్‌లైన్ పనులను ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు
కనిగిరి,మేజర్ న్యూస్ :ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు, స్వచ్ఛమైన తాగునీటిని అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా కనిగిరి మున్సిపాలిటీ పరిధిలో కొనసాగుతున్న ఇంటింటికి తాగునీటి పైప్‌లైన్ పనులను ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి శనివారం పరిశీలించారు.కనిగిరి మున్సిపాలిటీ పరిధిలోని శంఖవరం ప్రాంతంలో ఇంటింటికి కుళాయి ద్వారా తాగునీరు అందించేందుకు చేపడుతున్న నీటి పైప్‌లైన్ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పైప్‌లైన్ పనుల పురోగతి, ఏర్పాటు చేస్తున్న కనెక్షన్లు, ప్రజలకు నీటి సరఫరా అందే విధానం తదితర వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.అనంతరం ఒంగోలు ప్రధాన మార్గంలో టుబాకో బోర్డు సమీపంలో ఉన్న నీటి పైప్‌లైన్ ఫిల్టర్ అయ్యే ప్రదేశాన్ని పరిశీలించారు. అక్కడి నుంచి నీటి సరఫరా జరిగే విధానం, పైప్‌లైన్ సామర్థ్యం, ఫిల్టరేషన్ వ్యవస్థ, ప్రస్తుతం ఉన్న పరిస్థితులపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన చర్యలు చేపట్టాల అధికారులకు సూచించారు. పైప్‌లైన్ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, పనులను వేగవంతం చేసి ప్రజలకు వచ్చే ఆగష్ఠుకు తాగునీటి సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.ఈ కార్యక్రమంలో డిఈఈ విజయలక్ష్మి, సంబంధిత అధికారులు,ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపి అధ్యక్షులు షేక్ ఫిరోజ్ ,తెలుగు యువత అధ్యక్షులు అచ్చాల రవి ,నాయకులు బుల్లా బాలబాబు ,ఎన్ అంజి నాయుడు ,ఏనుగు శ్రీను ,చీర్ల నాగార్జున యాదవ్ తదితరులు పాల్గొన్నారు.