దేవరగట్టున సందర్శించిన ఆర్ డి ఓ
దేవరగట్టున సందర్శించిన ఆదోని ఆర్డీవో
హొళగుంద, సూర్య,(ఆలూరు)
కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం హొళగుంద మండల పరిధిలోని కొండ గుహలో వెలిసిన దేవరగట్టు మాళ మల్లేశ్వర స్వామి దేవాలయాన్ని ఆదోని ఆర్డిఓ అరుణాదేవి శనివారం సందర్శించారు. స్వామివారికి ప్రత్యేకంగా పూజలు జరిపించి దర్శించుకున్నారు. అనంతరం దేవరగట్టు పరిసర ప్రాంతాలను తిలకించారు.ఈనెల 21వ తేదీన జరిగే దేవరగట్టు బన్నీ ఉత్సవాలకు ఏర్పాట్లు చేయాలని మండల స్థాయిని అధికారులకు ఆదేశించారు. కార్యక్రమంలో తాసిల్దార్ లక్ష్మీ రాజు, వీఆర్వో నాగరాజు, రెవెన్యూ సిబ్బంది, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.