విశ్వకర్మలకు చేయూత.. పనిముట్ల పంపిణీ
50 మంది నిరుపేదలకు హ్యాండ్ డ్రిల్ మిషన్ల అందజేత
చౌటుప్పల్:విశ్వకర్మ చేతివృత్తుల కార్మికుల ఆర్థికాభివృద్ధికి హెచ్‌ఆర్‌సీ–రైట్ టు ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపట్టిన ‘ఎంపవర్‌మెంట్ ఆఫ్ విశ్వకర్మ’ కార్యక్రమాన్ని శనివారం చౌటుప్పల్ మున్సిపాలిటీలో ప్రారంభించారు. ఇందులో భాగంగా పేద విశ్వకర్మ కార్మికులకు చేతి పనిముట్లను పంపిణీ చేశారు.
చిట్యాల మండల అధ్యక్షుడు పంతంగి నాగాచారి చేతుల మీదుగా హ్యాండ్ డ్రిల్ మిషన్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విశ్వకర్మలు నేటికీ చేతివృత్తులపై ఆధారపడి జీవిస్తున్నారని, వారి జీవనోపాధికి తోడ్పాటునందించేందుకు ట్రస్ట్ ఆధ్వర్యంలో పనిముట్లు అందిస్తున్నట్లు తెలిపారు. చౌటుప్పల్ పరిధిలో గుర్తించిన 50 మంది నిరుపేద విశ్వకర్మలకు ఈ పరికరాలను అందించనున్నట్లు చెప్పారు.