శ్రీ వాసవి ఫార్మసీ కళాశాల విద్యార్థుల వీధి నాటక సందేశం.
తాడేపల్లిగూడెం, మేజర్ న్యూస్; ప్రపంచ ఫార్మసిస్టు దినోత్సవం మరియు జాతీయ ఫార్మసీ వారోత్సవాల సందర్భంగా తాడేపల్లిగూడెం శ్రీ వాసవి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫార్మా సైన్స్ స్ కళాశాల విద్యార్థులు స్వస్థ భారత్, యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ నిర్మూలనపై అవగాహన కల్పిస్తూ తాడేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్వస్థ భారత్ కార్యక్రమం మరియు వీధి నాటకం ప్రదర్శించి ఏ ఎంఆర్ వలన కలిగే దుష్ఫలితాలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి గ్రామస్తులకు వివరించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వి. భాస్కరరాజు మాట్లాడుతూ యాంటిబయాటిక్ మందుల వాడకాన్ని తగ్గించాలని కోరుతూ వాటి విపరీత వాడకం వల్ల కలిగే యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ వల్ల మనకు కలిగే నష్టాలను గ్రహించి మసులుకోవాలని సూచించారు. ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నోడల్ ఆఫీసర్ డాక్టర్ డి.కే.సత్పతి, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ శ్రీనివాస్ తదితరులు ప్రసంగించారు. ప్రజారోగ్య పరిరక్షణ కోసం ముఖ్యమైన అంశాన్ని ఎంచుకొని చక్కని నాటకం ద్వారా ప్రజలకు అవగాహన కల్పించిన విద్యార్ధులను కళాశాల పాలకవర్గ అధ్యక్ష,కార్యదర్శులు గ్రంధి సత్యనారాయణ, చలంచర్ల సుబ్బారావులు అభినందించారు. ఈ కార్యక్రమంలో పెదతాడేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు షేక్ లాల్ బేబి, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
శ్రీనివాస్ తాడేపల్లిగూడెం