పబ్బు రాజుగౌడ్ కుటుంబానికి పరామర్శ
చౌటుప్పల్, మేజర్ న్యూస్: మండలంలోని దండుమల్కాపురానికి చెందిన మునుగోడు కాంగ్రెస్ ఎన్నికల ఇన్‌ఛార్జి పబ్బు రాజుగౌడ్ తల్లి వజ్రమ్మ మృతి చెందడంతో లింగోజీగూడెం కాంగ్రెస్ నాయకులు మల్కాపురంలోని ఆయన నివాసానికి వెళ్లారు. వజ్రమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, రాజుగౌడ్ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.పీఏసీఎస్ చైర్మన్ ఈడుదుల మస్తాన్‌బాబు యాదవ్, కౌన్సిలర్ పల్లె లావణ్య సురేందర్‌రెడ్డి, పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు బండమీది వెంకటేష్, పార్టీ పట్టణ కమిటీ ఉపాధ్యక్షులు కళ్లెం దయాకర్ రెడ్డి,మాజీ సర్పంచ్ ఉదరి నర్సింహ,యువజన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు తోర్పునూరి శ్రీకాంత్ గౌడ్, మాజీ గ్రామశాఖ అధ్యక్షులు ఎర్రగోని లింగస్వామి, ముత్యాల మహేష్, పిల్ల వెంకట్, ముత్యాల కిరణ్ తదితరులు పాల్గొన్నారు.