BREAKING
టెర్మినల్ టు యానం..అంతా మాఫియా ఈ నెల 5న ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఇరాన్ చమురు మంత్రి మొహ్సిన్ పాక్నెజాద్ రాజీనామా 'స్పేస్‌ఎక్స్ ఏఐ' పేరును 'స్పేస్‌ఎక్స్ ఎస్ఐ'గా మార్చనున్న ఎలన్ మస్క్ గణపతి నిమజ్జన కార్యక్రమంలో లడ్డూ వేలం పాటలో పాల్గొన్న బొడ్డేటి కిరణ్ కుమార్.. సొంత గడ్డపై సత్తా చాటిన గుడిలోవ విద్యార్థులు... విజ్ఞాన్ గ్రాండ్ ఫిక్స్ - సెషన్ 1లో ప్రతిష్టాత్మక అవార్డులు...... రష్యా ఆక్రమిత ఒలేష్కీలో డ్రోన్ల ద్వారా ఆహార సరఫరా వైద్యులు నిర్లక్ష్యం వల్ల పాప చనిపోయిందని బంధువుల ఆందోళన.. దుర్గాదేవి నవరాత్రులకు ముహూర్తపు రాట బాలల హక్కుల పరిరక్షణపై కమిషన్ సభ్యురాలి పర్యటన అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో మహిళ ఆత్మహత్య నాణ్యమైన తాగునీరందించడమే లక్ష్యం.. 13 వ వార్డు లోనాగవంశం కులస్తులకు వైసిపి టికెట్ కేటాయించాలి తమిళనాడు బాలికల టైటిల్‌ నిలబెట్టుకుంది.. రాజస్థాన్‌దే బాలుర కిరీటం

ఉపముఖ్యమంత్రి, మంత్రులను మర్యాదపూర్వకంగా కలిసిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య

Select Suryaa Now
ఉపముఖ్యమంత్రి, మంత్రులను మర్యాదపూర్వకంగా కలిసిన  ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య

 

యాదగిరిగుట్ట మేజర్ న్యూస్...

ఉప ముఖ్యమంత్రివర్యులు భట్టి విక్రమార్క ని, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తంకుమార్ రెడ్డిలను మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కలిసారు. ఈ సందర్భంగా ఆయన అభివృద్ధి కోసం పలువురి కి వినతి పత్రాలు సమర్పించారు. ఆలేరు నియోజకవర్గంలో అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని ఆయన వీరిని కోరారు. ఈ సందర్భంగా వీరు సానుకూలంగా స్పందించారు ఆయన మంత్రులను కలిసిన తర్వాత ఆయా అభివృద్ధి పనులపై చర్చించి వీరికి శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆలేరు నియోజకవర్గం లో అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తామని మంత్రులు బట్టి విక్రమార్క, ఉత్తంకుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా ఆలేరు నియోజకవర్గానికి సంబంధించిన పలు అభివృద్ధి, సంక్షేమ అంశాలను ఉప ముఖ్యమంత్రివర్యుల దృష్టికి తీసుకెళ్లారు. నియోజకవర్గంలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు, వివిధ సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలపై చర్చించారు.
ఆలేరు నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం నుంచి అవసరమైన సహకారం అందించాలని బీర్ల ఐలయ్య కోరారు. ప్రజల సంక్షేమం, నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు.