నకిలీ పాస్ పుస్తకాలకు ఇక చెక్ బాపట్ల జాయింట్ కలెక్టర్ భావన వెల్లడి
నగరం, మేజర్ న్యూస్:నకిలీ పట్టాదారు పాస్‌బుక్‌ల సృష్టి అత్యంత కష్టతరమని జిల్లా సంయుక్త కలెక్టర్ భావన వశిష్ట అన్నారు. శనివారం మండలంలోని ఏలేటిపాలెం రెవెన్యూ గ్రామం, బెల్లంవారిపాలెం పంచాయతీలోని PACS భవనంలో నిర్వహించిన పట్టాదారు పాస్‌బుక్ పంపిణీ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ భావన వశిష్ట ముఖ్యఅతిథిగా హాజరై అర్హులైన రైతులకు పట్టాదారు పాస్‌బుక్‌లను పంపిణీ చేశారు భూమికి సంబంధించిన హక్కులను నిర్ధారించడంలో పట్టాదారు పాస్‌బుక్‌లు ఎంతో కీలకమైనవని ఆమె తెలిపారు.