BREAKING
ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మను కలసి సన్మానించిన నసనకోట ఎం జె పి విద్యా కమిటీ చైర్మన్ సౌజన్య ఎస్‌ఎస్‌ రాజమౌళి వారణాసి సినిమా షూటింగ్ అప్‌‌డేట్, రికార్డు వేగంతో జక్కన్న ప్రాజెక్ట్ ఓటీటీకి వచ్చేసిన మలయాళ సెన్సేషనల్ క్రైమ్ థ్రిల్లర్... బాక్సాఫీస్ వద్ద రూ.50 కోట్లు వసూలు చేసిన సినిమా స్ట్రీమింగ్ ఎప్పుడంటే కూటమి హామీలన్నీ నీటి మూటలే.. ప్రజలకు వాస్తవాలు వివరించాలి. స్థానిక ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలి: తన్నీరు నాగేశ్వరరావు పార్టీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ దేవర చుట్టమల్లే ఏఐ మార్ఫింగ్ వీడియోపై కుష్బూ సుందర్ తీవ్ర ఆగ్రహం.. మహిళల గౌరవం ఆటవస్తువు కాదంటూ ఘాటు వ్యాఖ్యలు ఎన్నికల సంఘం స్వతంత్ర తను కాపాడా లి ఎస్ ఐ ఆర్ ప్రక్రియ ను నిలిపివేయాలి... సీపీఐ - సిపిఎం… ఎన్నికల సంఘం స్వతంత్రతను కాపాడాలి నేడు గార్లకు రానున్న ఎమ్మెల్యే కోరం కనకయ్య కార్నెల్ విశ్వవిద్యాలయ సామూహిక అత్యాచార బాధితురాలికి బెదిరింపులు రెడ్‌క్రాస్‌ జిల్లా చైర్మన్‌గా డాక్టర్‌ ఎస్‌.ఎం. రాజేశ్వర్‌రావు స్థానిక ఎన్నికలకు వైఎస్సార్‌సీపీ సన్నద్ధం పెనుగంచిప్రోలులో పార్టీ శ్రేణులకు సభ్యత్వ కార్డుల పంపిణీ ఏఐ మార్ఫింగ్ వీడియోలపై జాన్వీ కపూర్ ఆవేదన: అనుమతి లేకుండా మహిళల చిత్రాలతో కల్పిత కంటెంట్ లైంగిక దాడికి సమానమని వ్యాఖ్య, ఎన్టీఆర్, చిరంజీవికి కృతజ్ఞతలు రాంపల్లి మరో జవహర్‌నగర్‌గా మారొద్దు.. ! సెంట్రల్ అమెరికన్ పార్లమెంట్ నుంచి తప్పుకుంటున్నట్లు నికరాగ్వా సంచలన ప్రకటన బీసీల హక్కుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది... నాగండ్లలో నేత్రదానం

*గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !* *విలేకరుల సమావేశంలో మధిర తాసిల్దార్ రాళ్ల బండి రాంబాబు -*

Select Suryaa Now
*గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !*    *విలేకరుల సమావేశంలో మధిర తాసిల్దార్ రాళ్ల బండి రాంబాబు -*

మధిర, సూర్య మేజర్ న్యూస్ :తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక ఘట్టానికి రంగం సిద్ధమైంది. రాష్ట్రంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ అలాగే వరంగల్-ఖమ్మం-నల్గొండ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు జరగనున్న ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం అధికారిక ప్రకటన జారీ చేసింది. వచ్చే ఏడాది 2027 మార్చి నెలలో సిట్టింగ్ ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో, ఈ రెండు స్థానాలకు కొత్తగా ఓటర్ల జాబితాను సిద్ధం చేస్తున్నారు.రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశానుసారం పూర్తి స్థాయి షెడ్యూల్‌ను శనివారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో  తాసిల్దార్ రాళ్ల బండి రాంబాబు మాట్లాడుతూ 2023 లో డిగ్రీ పూర్తి చేసిన అర్హులైన నిరుద్యోగులు, ఉద్యోగులు మరియు పట్టభద్రులు తమ ఓటు హక్కు కోసం నవంబర్ 6వ తేదీ వరకు ఫారం-18 ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారని తెలిపారు
నవంబర్ 25వ తేదీన ముసాయిదా (డ్రాఫ్ట్) ఓటర్ల జాబితాను ప్రచురించబడుతుందని తెలిపారు. ఒకవేళ ముసాయిదా జాబితాలో పేర్లు లేకపోతే లేదా తప్పులు ఉంటే, వాటి సవరణలు మరియు అభ్యంతరాల స్వీకరణ కోసం నవంబర్ 25 నుండి డిసెంబర్ 10వ తేదీ వరకు ప్రత్యేక సమయం కేటాయించడం జరుగుతుందన్నారు. ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలను నిశితంగా పరిశీలించి అన్ని రకాల మార్పు చేర్పులు పూర్తి చేసిన అనంతరం, డిసెంబర్ 30వ తేదీన తుది ఓటర్ల జాబితాను అధికారికంగా విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు. అత్యంత గమనించాల్సిన కీలక విషయం ఏమిటంటే.. గతంలో పాత ఓటర్ల జాబితాలో పేర్లు ఉన్నవారు సైతం ఈసారి కొత్తగా మార్పు చేసిన ఫారం-18 ద్వారా విధిగా దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేశారు.దరఖాస్తుతో పాటు అర్హతకు సంబంధించిన ధ్రువీకరించిన సర్టిఫికెట్ల కాపీలను జతచేయాల్సి ఉంటుంది. పట్టభద్రులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సకాలంలో దరఖాస్తు చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.