BREAKING
ఐఎంసీ 2026లో రోబోటిక్స్‌తో అదరగొట్టిన యువ శాస్త్రవేత్తలు: 'జెనీవా' గ్లోబల్ ఫైనల్స్‌కు భారత్ తరఫున అర్హత సాధించిన విజేతలు! గోవింద నామ స్మరణతో మార్మోగుతున్న తిరుమల గిరులు నస్పూర్ టీఎన్జీవో హౌసింగ్ సొసైటీలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు వేడుకలను ప్రారంభించిన హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు గడియారం శ్రీహరి హ్యాకింగ్ ముఠాతో చేతులు కలిపిన అమెరికాలో కెనడా ఎగ్జిక్యూటివ్ అరెస్ట్ ఒమన్ గల్ఫ్‌లో ఇరాన్ నావికాదిగ్బంధాన్ని ఉల్లంఘించిన కార్గో నౌకను నిలిపివేసిన అమెరికా సైన్యం నవరాత్రుల వేడుకలకు ముస్తాబైన, కమల మల్లేశ్వరుడు. మహీంద్రా ఏరోస్పేస్ అనుబంధ సంస్థలో 51 శాతం వాటా కొనుగోలు చేయనున్న బ్రెజిల్ ఎంబ్రేయర్: కీలక ఒప్పందం కుదుర్చుకున్న ఎం&ఎం! అంతర్జాతీయ దిగ్గజ సంస్థల సీఈవోలతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భేటీ : భారత్‌లో పెట్టుబడులకు విస్తృత అవకాశాలని పిలుపు! ఎన్నికల వేళ పోలీసుల అప్రమత్తం సమస్యాత్మక గ్రామాల్లో ముమ్మర గస్తీ.. గ్రామసభలతో ప్రజలకు అవగాహన ఎగుమతుల రంగంలో విశేష ప్రతిభ: అదానీ డిఫెన్స్‌కు ప్రతిష్టాత్మక ‘ఎస్ఐడీఎం ఛాంపియన్ అవార్డు 2026’! 2047 లక్ష్యాల సాధనకు భారత పరిశ్రమలు ఆవిష్కరణలను వేగవంతం చేయాలి: కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ పిలుపు! జోర్డాన్ కొత్త సరుకు రవాణా రైలు నెట్‌వర్క్:భారత్-మిడిల్ ఈస్ట్-యూరప్ ఎకనామిక్ కారిడార్ లో కీలక లింక్‌గా మారే అవకాశం! ఆర్కిటిక్ మార్గంలో దక్షిణ కొరియా చారిత్రాత్మక వాణిజ్య నౌకాయానం సస్పెన్షన్ ఉత్తర్వులు లేకుండానే ఖాళీ పోస్టు నోటిఫికేషన్ ఎలా ఇస్తారు? వాణిజ్య విభేదాల నడుమ బలపడుతున్న భారత్-అమెరికా రక్షణ బంధం: అడ్మిరల్ పాపారో పర్యటనతో సరికొత్త జోరు.. తాజా నివేదిక వెల్లడి!

ఇది కలలో కూడా ఊహించలేదు: డొరొతీ సినిమాపై హీరోయిన్ కీర్తి సురేష్ ఆసక్తికర వ్యాఖ్యలు

Select Suryaa Now
ఇది కలలో కూడా ఊహించలేదు: డొరొతీ సినిమాపై హీరోయిన్ కీర్తి సురేష్ ఆసక్తికర వ్యాఖ్యలు

సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ వరుస ప్రాజెక్ట్‌లతో దూసుకుపోతున్నారు. ఒకవైపు స్టార్ హీరోల చిత్రాల్లో నటిస్తూనే, మరోవైపు లేడీ ఓరియంటెడ్ కథలు మరియు స్పెషల్ సాంగ్స్‌‌తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇటీవల నానితో కలిసి ‘ది ప్యారడైజ్’ మూవీలో స్పెషల్ సాంగ్ చేసిన ఈ భామ, తాజాగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘డోరతి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తమిళంలో మంచి ఆదరణ పొందిన ఈ చిత్రం తాజాగా తెలుగు ప్రేక్షకుల ముందుకు కూడా వచ్చి విశేషంగా ఆకట్టుకుంటోంది.

ఈ సినిమా విడుదల సందర్భంగా కీర్తి సురేష్ సోషల్ మీడియా వేదికగా తన ఆనందాన్ని, అనుభూతులను అభిమానులతో పంచుకున్నారు. డొరతి సినిమా తన మనసులో ఎప్పటికీ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుందని ఆమె పేర్కొన్నారు. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో నటించాలనే తన చిరకాల కోరిక ఈ చిత్రంతో నెరవేరిందని, ఆయన నమ్మకంతో తనకు ఈ అవకాశం ఇవ్వడం సంతోషంగా ఉందని తెలిపారు. ఈ చిత్రంలో తన పాత్ర సాధారణ కమర్షియల్ చిత్రాలకు భిన్నంగా ఉండటంతో ప్రేక్షకులు కూడా దీనిని విశేషంగా ఆదరిస్తున్నారని ఆమె తెలిపారు.

ఈ చిత్రానికి మరో ప్రధాన ఆకర్షణ అయిన లెజెండరీ సంగీత దర్శకుడు ఇళయరాజా గురించి కీర్తి సురేష్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన సృష్టించిన మ్యూజికల్ వరల్డ్‌లో తాను భాగం కావడం ఊహించని అనుభవమని, ఇది తాను కలలో కూడా ఊహించలేదని ఆమె పేర్కొన్నారు. ఒకవైపు డొరతి విజయాన్ని ఆస్వాదిస్తున్న ఆమె, త్వరలో విడుదల కానున్న ‘సత్యవాన్ సావిత్రి’ చిత్రంలో లాయర్ పాత్రలో కనిపించనున్నారు. వైవిధ్యమైన కథాంశాలను ఎంచుకుంటూ దూసుకెళ్తున్న కీర్తి సురేష్ కెరీర్ ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.