BREAKING
ఐఎంసీ 2026లో రోబోటిక్స్‌తో అదరగొట్టిన యువ శాస్త్రవేత్తలు: 'జెనీవా' గ్లోబల్ ఫైనల్స్‌కు భారత్ తరఫున అర్హత సాధించిన విజేతలు! గోవింద నామ స్మరణతో మార్మోగుతున్న తిరుమల గిరులు నస్పూర్ టీఎన్జీవో హౌసింగ్ సొసైటీలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు వేడుకలను ప్రారంభించిన హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు గడియారం శ్రీహరి హ్యాకింగ్ ముఠాతో చేతులు కలిపిన అమెరికాలో కెనడా ఎగ్జిక్యూటివ్ అరెస్ట్ ఒమన్ గల్ఫ్‌లో ఇరాన్ నావికాదిగ్బంధాన్ని ఉల్లంఘించిన కార్గో నౌకను నిలిపివేసిన అమెరికా సైన్యం నవరాత్రుల వేడుకలకు ముస్తాబైన, కమల మల్లేశ్వరుడు. మహీంద్రా ఏరోస్పేస్ అనుబంధ సంస్థలో 51 శాతం వాటా కొనుగోలు చేయనున్న బ్రెజిల్ ఎంబ్రేయర్: కీలక ఒప్పందం కుదుర్చుకున్న ఎం&ఎం! అంతర్జాతీయ దిగ్గజ సంస్థల సీఈవోలతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భేటీ : భారత్‌లో పెట్టుబడులకు విస్తృత అవకాశాలని పిలుపు! ఎన్నికల వేళ పోలీసుల అప్రమత్తం సమస్యాత్మక గ్రామాల్లో ముమ్మర గస్తీ.. గ్రామసభలతో ప్రజలకు అవగాహన ఎగుమతుల రంగంలో విశేష ప్రతిభ: అదానీ డిఫెన్స్‌కు ప్రతిష్టాత్మక ‘ఎస్ఐడీఎం ఛాంపియన్ అవార్డు 2026’! 2047 లక్ష్యాల సాధనకు భారత పరిశ్రమలు ఆవిష్కరణలను వేగవంతం చేయాలి: కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ పిలుపు! జోర్డాన్ కొత్త సరుకు రవాణా రైలు నెట్‌వర్క్:భారత్-మిడిల్ ఈస్ట్-యూరప్ ఎకనామిక్ కారిడార్ లో కీలక లింక్‌గా మారే అవకాశం! ఆర్కిటిక్ మార్గంలో దక్షిణ కొరియా చారిత్రాత్మక వాణిజ్య నౌకాయానం సస్పెన్షన్ ఉత్తర్వులు లేకుండానే ఖాళీ పోస్టు నోటిఫికేషన్ ఎలా ఇస్తారు? వాణిజ్య విభేదాల నడుమ బలపడుతున్న భారత్-అమెరికా రక్షణ బంధం: అడ్మిరల్ పాపారో పర్యటనతో సరికొత్త జోరు.. తాజా నివేదిక వెల్లడి!

బిగ్‌బాస్ 10 హౌస్‌లో నాలుగో వారం ఎలిమినేషన్ హీట్.. డేంజర్ జోన్‌లో ఆ ఇద్దరు కంటెస్టెంట్లు

Select Suryaa Now
బిగ్‌బాస్ 10 హౌస్‌లో నాలుగో వారం ఎలిమినేషన్ హీట్.. డేంజర్ జోన్‌లో ఆ ఇద్దరు కంటెస్టెంట్లు

సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: రసవత్తరంగా సాగుతున్న రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు పదవ సీజన్ నాలుగో వారం ముగింపు దశకు చేరుకుంది. గత వారం ఊహించని పరిణామాల మధ్య ఎలిమినేషన్ ప్రక్రియ నిలిచిపోవడంతో, ఈసారి హౌస్ నుంచి బయటకు వెళ్లే కంటెస్టెంట్ ఎవరనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా ఈ వారం నామినేషన్లలో భారీగా కంటెస్టెంట్లు నిలవడం, ఓటింగ్ ట్రెండ్స్ మారడం బుల్లితెర ప్రేక్షకుల్లో తీవ్ర చర్చకు దారితీసింది.

ఈ వారానికి సంబంధించి నామినేషన్ ప్రక్రియలో త్రిగుణ్, రోహిత్, ముఖేశ్, చరణ్, నరేశ్, షాలిని, దేబ్జానీ, అమన్, సృష్టితో కలిపి మొత్తం తొమ్మిది మంది కంటెస్టెంట్లు బరిలో నిలిచారు. అయితే అనధికారిక ఓటింగ్ సరళిని పరిశీలిస్తే వీరిలో త్రిగుణ్ ముందంజలో దూసుకెళ్తుండగా, మరికొందరు సభ్యులు సురక్షిత ప్రాంతంలో ఉన్నట్లు తెలుస్తోంది. కానీ కామనర్స్ కోటా నుంచి వచ్చిన సృష్టి అలాగే చరణ్ పేర్లు మాత్రం డేంజర్ జోన్‌లో ఉన్నట్లు సమాచారం వెలువడుతోంది. సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చల ప్రకారం ఓటింగ్‌లో వెనుకబడిన వీరిద్దరిలో ఒకరు హౌస్‌ను వీడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది.

గత వారాల్లో జరిగిన నాటకీయ పరిణామాలు, హౌస్‌లో కంటెస్టెంట్లు ప్రదర్శిస్తున్న తీరు ఈ ఎలిమినేషన్‌పై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా గేమ్‌లో తమదైన శైలిలో రాణించేందుకు కంటెస్టెంట్లు శ్రమిస్తున్నప్పటికీ, ప్రేక్షకుల నుంచి పడుతున్న ఓట్లే తుది ఫలితాన్ని నిర్ణయించనున్నాయి. మరోవైపు ఈ వీకెండ్ ఎపిసోడ్‌లో హోస్ట్ నాగార్జున కంటెస్టెంట్ల ఆటతీరును ఏ విధంగా బేరీజు వేస్తారు, ఎవరికి ఏ రకమైన క్లాస్ పీకుతారనే అంశంపై ఆసక్తి నెలకొంది. ఏది ఏమైనప్పటికీ ఈ నాల్గో వారం ఎలిమినేషన్ గండం ఎవరి చుట్టుకుంటుందనే ఉత్కంఠకు కొన్ని గంటల్లో తెరపడనుంది.