ప్రాజెక్ట్ డైరెక్టర్‌కు ‘వి బి జి రామ్ జి’ సిబ్బంది వినతి: జీతాలు పెంచాలని డిమాండ్
విజయనగరం అక్టోబర్ 3 మేజర్ న్యూస్:;గ్రామీణాభివృద్ధి శాఖలో గత 20 ఏళ్లుగా నిబద్ధతతో సేవలు అందిస్తున్న ‘వి బి జి రామ్ జి’ (VB G RAM G) సిబ్బంది ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ జాయింట్ యాక్షన్ కమిటీ (JAC) ప్రతినిధులు జిల్లా నీటి యాజమాన్య సంస్థ (DWMA) ప్రాజెక్ట్ డైరెక్టర్‌కు శనివారం ఒక అధికారిక వినతి పత్రాన్ని సమర్పించారు.
ఈ సందర్భంగా JAC ప్రతినిధులు మాట్లాడుతూ, ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లడంలో తాము కీలక పాత్ర పోషిస్తున్నామని తెలిపారు. అయితే, గత 7 సంవత్సరాలుగా జీతభత్యాలలో ఎలాంటి పెంపు లేకపోవడంతో పెరిగిన నిత్యావసర ధరలు, కుటుంబ పోషణ, పిల్లల చదువులు మరియు వైద్య ఖర్చులతో తీవ్ర ఆర్థిక, మానసిక ఇబ్బందులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇటీవల సమావేశమైన ఉద్యోగ సంఘాల నిర్ణయం మేరకు, తమ న్యాయపరమైన డిమాండ్లను ఈ నెల 10వ తేదీ లోగా (10-10-2026) పరిష్కరించాలని అధికారులను కోరారు. తమ సుదీర్ఘ సేవలను గుర్తించి, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచేలా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకోవాలని ప్రాజెక్ట్ డైరెక్టర్‌ను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో JAC ప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు.