జైనూర్ సర్కిల్ పరిధిలో వాలీబాల్ టోర్నమెంట్
సూర్య జైనూర్ : జిల్లా ఎస్పీ మేడం ఆదేశాల మేరకు, ఆసిఫాబాద్ డీఎస్పీ సూచనలతో యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడంతో పాటు, యువతను క్రీడల వైపు ప్రోత్సహించే ఉద్దేశంతో జైనూర్ సర్కిల్ పరిధిలో వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు జైనూర్ సీఐ తెలిపారు. జైనూర్, సిర్పూర్-యు, లింగాపూర్, కెరమెరి మండలాలకు చెందిన ప్రజలు, క్రీడాకారుల కోసం ఈ టోర్నమెంట్‌ను ఈ నెల 12, 13, 14 తేదీలలో నిర్వహించనున్నారు. నాలుగు మండలాలకు చెందిన ఆసక్తి గల క్రీడాకారులు, జట్లు టోర్నమెంట్‌లో పాల్గొని క్రీడా స్ఫూర్తిని చాటాలని కోరారు. యువతను క్రీడల వైపు ప్రోత్సహించడం ద్వారా ఆరోగ్యకరమైన జీవనశైలి, క్రమశిక్షణ, స్నేహభావం, ఐక్యత పెంపొందించడంతో పాటు, యువత మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాల వైపు ఆకర్షితులు కాకుండా చెడు వ్యసనాలకు దూరంగా ఉండేలా అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. క్రీడాకారులు తమ జట్లకు సంబంధించిన వివరాలను జైనూర్ సర్కిల్ కార్యాలయంలో లేదా సంబంధిత పోలీస్ స్టేషన్లలో అందజేయాలని సూచించారు.
సంప్రదించవలసిన నంబర్లు: జైనూర్: 8712527856
: సిర్పూర్-యు: 8712528285 :లింగాపూర్: 8074211610