దివికేగిన ప్రభాకరుడు
కావలి, ,మేజర్ న్యూస్ : కావలి నియోజకవర్గపు ఆశా జ్యోతి, పేద, బడుగు బలహీన, దళిత, గిరిజన వర్గాల ఆశాకిరణం,అభినవ సుశృతుడు, పేదలపాలిట పెన్నిధి,ఎంతోమంది నిరుపేదలకు ఉచితంగా వైద్యంఅందించిన ప్రముఖ వైద్యనిపుణులు,లక్ష్యకు మించి ఆపరేషన్స్ అలవోకగాచేసిన రోబోటిక్ సర్జన్, వైద్యరంగంలో మరియు ప్రజాసేవలో తన విస్తృత సేవలతో ప్రజలపట్ల ఎంతో ఆత్మీయత అనురాగాలతో నడుచుకునే ప్రజానాయకుడు అస్తమించని సూర్యుడు మా/మీ/మన (ప్రభాకరుడు) హిందూవులలో హిందువుగా... ముస్లింలో మహ్మదీయుడుగా... క్రైస్తవులలో క్రిస్టియన్ గా... కుల, మత, జాతి, వర్గ వైషమ్యాలుచూడకుండా తన దగ్గరికివచ్చిన ప్రతీ ఒక్కరినీ ఆప్యాయత అనురాగాలతో పలకరించి తనకితోచిన సహాయం చేసిన అభినవదానకర్ణుడు మన డాక్టర్ ప్రభాకర్ నాయుడు మాజీమున్సిపల్ చైర్మన్ గా, కాపులలో కులపెద్దగా, ఎందురో డాక్టర్స్ కి గురువుగా,ఆదర్శ ప్రాయులుగా వెలుగొందిన మనజాతిరత్నం డాక్టర్ ప్రభాకర్ నాయుడుగారు స్వర్గస్థులవ్వడం అత్యంత బాధాకరం... మరియు నియోజకవర్గంనకే కాకుండా యావత్ ఆంధ్రప్రదేశ్ కే ఒక దుర్థినం మా ఆత్మీయులు డాక్టర్ ప్రభాకర్ నాయుడుగారి ఆత్మ శాంతించాలని,ఆయనకు స్వర్గ ప్రాప్తికలగాలని భగవంతునికోరుకుంటూ...