జల జీవన్ మిషన్‌ను విజయవంతం చేయాలి
జల జీవన్ మిషన్‌ను విజయవంతం చేయాలి
– ఏఎంసీ చైర్మన్ యారవ రమాశ్రీనివాస్
పామూరు, మేజర్ న్యూస్ :
ప్రొద్దుటూరు వేదికగా సోమవారం జరగనున్న రూ.30 వేల కోట్ల ప్రతిష్టాత్మక జల జీవన్ మిషన్ పనుల శంకుస్థాపన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కనిగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, కార్యక్రమ ఇన్‌చార్జ్ యారవ రమాశ్రీనివాస్ పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి సంబంధించి ఆదివారం బద్వేలు నియోజకవర్గంలో ఆయన విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రమాశ్రీనివాస్ మాట్లాడుతూ ప్రొద్దుటూరులో జరగనున్న జల జీవన్ మిషన్ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని, రాష్ట్రానికి ఎంతో కీలకమైన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. బద్వేలు నియోజకవర్గంలోని కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో ప్రొద్దుటూరుకు తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కూటమి శ్రేణుల బలం, ఐక్యతను చాటిచెప్పేలా ప్రతి ఒక్కరూ రేపటి కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బద్వేలు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్, కడప డీసీసీబీ చైర్మన్‌తో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.