BREAKING
నేడు గార్లకు రానున్న ఎమ్మెల్యే కోరం కనకయ్య కార్నెల్ విశ్వవిద్యాలయ సామూహిక అత్యాచార బాధితురాలికి బెదిరింపులు రెడ్‌క్రాస్‌ జిల్లా చైర్మన్‌గా డాక్టర్‌ ఎస్‌.ఎం. రాజేశ్వర్‌రావు స్థానిక ఎన్నికలకు వైఎస్సార్‌సీపీ సన్నద్ధం పెనుగంచిప్రోలులో పార్టీ శ్రేణులకు సభ్యత్వ కార్డుల పంపిణీ ఏఐ మార్ఫింగ్ వీడియోలపై జాన్వీ కపూర్ ఆవేదన: అనుమతి లేకుండా మహిళల చిత్రాలతో కల్పిత కంటెంట్ లైంగిక దాడికి సమానమని వ్యాఖ్య, ఎన్టీఆర్, చిరంజీవికి కృతజ్ఞతలు రాంపల్లి మరో జవహర్‌నగర్‌గా మారొద్దు.. ! సెంట్రల్ అమెరికన్ పార్లమెంట్ నుంచి తప్పుకుంటున్నట్లు నికరాగ్వా సంచలన ప్రకటన బీసీల హక్కుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది... నాగండ్లలో నేత్రదానం కుమ్మరి సంఘ భవన నిర్మాణానికి సంపూర్ణ సహకారం అందజేస్తాము* నాగండ్ల లో నేత్రదానం నారా లోకేష్ సంకల్పం.. నాగపూర్‌లో ఫడ్నవీస్‌కు వివరించిన రవి నాయుడు మంగళవారం జాబ్ మేళా నేడు ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక పోలింగ్ బూత్ లను పరిశీలించిన యస్. ఐ.

కర్నూలులో వైభవంగా అశోక్ సింఘాల్ జీ శతజయంతి వేడుకలు

Select Suryaa Now
కర్నూలులో వైభవంగా అశోక్ సింఘాల్ జీ శతజయంతి వేడుకలు

 

-మదనపల్లె నుండి హాజరైన వీ.హెచ్.పి ప్రతినిధులు,విశిష్ట వ్యక్తులు


మదనపల్లె : మాన్యశ్రీ అశోక్ సింఘాల్ జీ శతజయంతి ఉత్సవాలలో భాగంగా ఆదివారం కర్నూలులో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో బ్రహ్మోండమైన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి దక్షిణాంధ్రకు చెందిన 16 జిల్లాల నుంచి విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు,విశిష్ట వ్యక్తులు సహా 700 మందికిపైగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా విశ్వహిందూ పరిషత్ కేంద్రీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి మాన్యశ్రీ కోటేశ్వర శర్మ  అశోక్ సింఘాల్ జీ జీవిత చరిత్రను,హిందూ సమాజానికి ఆయన అందించిన విశిష్ట సేవలను కళ్లకు కట్టినట్లుగా వివరించారు.ముఖ్యంగా సామాజిక సమరసత సాధన కోసం అశోక్ సింఘాల్ జీ చేసిన కార్యక్రమాలు,ఆయన ఆలోచనా విధానం,సమాజాన్ని ఏకతాటిపైకి తీసుకురావడానికి చేసిన కృషిని వివరించారు.అశోక్ సింఘాల్ జీ ఆశయ సాధనకు కృషిచేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర సామాజిక సమరసత కన్వీనర్ చింతపర్తి మహేష్,మదనపల్లి జిల్లా అధ్యక్షులు గట్టి రామ్మోహన్,జిల్లా కార్యదర్శి సోంపల్లి సురేష్ బాబు హాజరుకాగా విశిష్ట అతిథులుగా వాల్మీకి సంఘం రాష్ట్ర అధ్యక్షులు పులి శ్రీనివాసులు,రాష్ట్ర ఉపాధ్యక్షులు సద్దల జయసింహ,ఎస్టీ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి పి.బొజ్జప్ప పాల్గొన్నారు.అశోక్ సింఘాల్ జీ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని హిందూ సమాజంలో ఐక్యత,సామాజిక సమరసత,ధార్మిక చైతన్యం పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.