పూడివలసలో పోలీసుల పల్లెనిద్ర
బాడంగి, అక్టోబర్ 4 (మేజర్ న్యూస్):
బాడంగి మండలం పూడివలస గ్రామంలో శనివారం రాత్రి బొబ్బిలి రూరల్ సీఐ ఆర్ మల్లికార్జున రావు, బాడంగి ఎస్‌ఐ పి.సూర్యకుమారి ఆధ్వర్యంలో పోలీసులు, ఎవేర్నెస్, పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో గ్రామసభ నిర్వహించి ప్రజలకు పలు అంశాలపై అవగాహన కల్పించారు.
డ్రగ్స్, మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే అనర్థాలు, సైబర్ నేరాల పట్ల అప్రమత్తత, గ్రామీణ ప్రాంతాల్లో భద్రతా చర్యలు, నేరాల నివారణలో ప్రజల భాగస్వామ్యం తదితర అంశాలపై పోలీసులు అవగాహన కల్పించారు. ముఖ్యంగా సైబర్ మోసాలకు గురికాకుండా అపరిచిత లింకులు, ఫోన్ కాల్స్, సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. గ్రామంలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు, అనుమానాస్పద వ్యక్తుల సంచారం లేదా నేరాలకు సంబంధించిన సమాచారం తెలిసినా వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. మహిళా చట్టాలపై మహిళ యాప్ పై ప్రజలకు అవగాహన కల్పించారు పల్లెనిద్రలో భాగంగా పోలీసులు గ్రామంలో రాత్రి బస చేసి ప్రజలకు భద్రతపై భరోసా కల్పించారు.