బుర్రిపాలెంలో సూపర్‌స్టార్ కృష్ణకు సీఎం చంద్రబాబు ఘన నివాళి
ఏపీ స్టేట్ బ్యూరో, అమరావతి :
తెనాలి నియోజకవర్గంలోని బుర్రిపాలెంలో సూపర్‌స్టార్ కృష్ణకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘన నివాళులర్పించారు. బుర్రిపాలెంలో ఏర్పాటు చేసిన సూపర్‌స్టార్ కృష్ణ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.సినీ రంగంలో తనదైన ముద్ర వేసిన కృష్ణ స్వగ్రామమైన బుర్రిపాలెంలో ఆయన విగ్రహానికి సీఎం నివాళులు అర్పించడం విశేషంగా నిలిచింది. ఈ సందర్భంగా కృష్ణతో ఉన్న అనుబంధాన్ని, ఆయన సినీ రంగానికి అందించిన సేవలను సీఎం చంద్రబాబు స్మరించుకున్నారు.కృష్ణ నటుడిగానే కాకుండా నిర్మాతగా, దర్శకుడిగా తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధికి విశేషంగా కృషి చేశారని సీఎం కొనియాడారు. బుర్రిపాలెం గ్రామానికి, తెలుగు సినీ ప్రేక్షకులకు కృష్ణ చిరస్మరణీయుడిగా నిలిచిపోయారని పేర్కొన్నారు.