BREAKING
విలేకరుల శిక్షణలో రేణిగుంట 6టీవీ రిపోర్టర్ శీను భారత పారిశ్రామికోత్పత్తిలో విరుద్ధ ధోరణులు: టెక్స్‌టైల్స్, అపెరల్ తయారీ రంగాల మధ్య పెరుగుతున్న భారీ అంతరం అంబేద్కర్ లేకుంటే మన బ్రతుకులు ఏమయ్యేవి…? ఎస్ఐఆర్ అంటే మీకు ఎందుకు జంకు జాతీయ స్థాయి మేళాకి నారాయణపేట విద్యార్థి ఎంపిక జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో వైద్య శిభిరం అభిమాని అతిచర్యకు షాకైన కన్నడ నటి రచితా రామ్.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో సంస్కార భారతి ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహిద్దాం : రాష్ట్ర సంఘటన మంత్రి జిపి నిరంజన్ 35 రూపాయలకే కిలో ఉల్లిపాయలు క్యాతన్ పల్లి లో నూతన సీతాఫల్ పల్ప్ కేంద్రం పరిశీలించిన జిల్లా అధికారులు మున్సిపల్ రిజర్వేషన్స్ పై ఉత్కంఠత సాగర్ ఆయకట్టుకు గోదావరి జలాలు.. మంత్రి తుమ్మల ఎన్టీఆర్‌కు మద్దతుగా నిలిచిన విజయ్ దేవరకొండ: ఏఐ దుర్వినియోగంపై హీరో తీవ్ర ఆగ్రహం కదిరిలో వివాహ వేడుకకు హాజరైన వైఎస్సార్‌సీపీ నాయకులు కైవ్‌లోని వంతెనతో పాటు నల్ల సముద్రంలో రెండు నౌకలపై రష్యా దాడులు

నేడు కడప జిల్లాలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ పర్యటన

Select Suryaa Now
నేడు కడప జిల్లాలో  సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ పర్యటన

- రూ.30,156 కోట్ల జల్‌జీవన్‌ మిషన్‌కు శ్రీకారం

ఏపీ స్టేట్ బ్యూరో, అమరావతి :

 ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌  నేడు  కడప జిల్లాలో పర్యటించనున్నారు. ప్రొద్దుటూరులో జల్‌జీవన్‌ మిషన్‌, అమరజీవి జలధార కార్యక్రమాలను వారు ప్రారంభించనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికీ సురక్షితమైన తాగునీటిని అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ భారీ కార్యక్రమాన్ని చేపట్టింది.

రూ.30,156 కోట్లతో ఇంటింటికీ తాగునీరు

జల్‌జీవన్‌ మిషన్‌లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికీ తాగునీటి కుళాయి కనెక్షన్‌ అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. మొత్తం రూ.30,156 కోట్ల అంచనా వ్యయంతో ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. ఇందులో భాగంగా 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు మంజూరు చేసి, గ్రామీణ కుటుంబాలకు తాగునీటి సౌకర్యాన్ని కల్పించనున్నారు.

ఉదయం 11.20 గంటలకు పైలాన్‌ ఆవిష్కరణ

 నేడు  ఉదయం 11.20 గంటలకు ప్రొద్దుటూరులో జల్‌జీవన్‌ మిషన్‌ పైలాన్‌ను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఆవిష్కరించనున్నారు. అనంతరం అమరజీవి జలధార కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేస్తున్నారు.

బహిరంగ సభలో పాల్గొనున్న చంద్రబాబు, పవన్‌

పైలాన్‌ ఆవిష్కరణ అనంతరం సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా చేపడుతున్న చర్యలు, జల్‌జీవన్‌ మిషన్‌ ద్వారా కల్పించనున్న సౌకర్యాలను వారు వివరించనున్నారు. సీఎం, డిప్యూటీ సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.