యువ క్రికెటర్లు అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి అనంతలో ముగిసిన ఆర్డిటి గ్రామీణ క్రికెట్ ప్రతిభాన్వేషణ జిల్లావ్యాప్తంగా 2 వేల మందికి పైగా హాజరు.. చరిత్రలో రికార్డు
(మల్లికార్జున నేటి దినపత్రిక సూర్య స్టాఫ్ రిపోర్టర్)
జిల్లాలోని 14 కేంద్రాల్లో ఆర్డిటి నిర్వహించిన గ్రామీణ క్రికెట్ ప్రతిభాన్వేషణ కార్యక్రమానికి 2 వేల మందికి పైగా యువ క్రీడాకారులు హాజరుకావడం జిల్లా క్రికెట్ చరిత్రలో రికార్డుగా నిలిచిందని ఆర్డిటి క్రికెట్ అభివృద్ధి కమిటీ చైర్మన్ మచ్చా రామలింగారెడ్డి అన్నారు.
అనంతపురంలోని ఆర్డిటి క్రీడా మైదానంలో ఆదివారం ప్రతిభావంతుల ఎంపికలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి, వారికి మెరుగైన శిక్షణ అందించడమే ఆర్డిటి లక్ష్యమన్నారు. ప్రతిభావంతులను గుర్తించి శిక్షణ శిబిరాలకు పంపుతున్నామని తెలిపారు. జిల్లా నుంచి మరింత మంది రాష్ట్ర, జాతీయ స్థాయి, రంజీ క్రీడాకారులుగా ఎదగాలని ఆకాంక్షించారు.
ఎంపికల్లో 90 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఎంపికైన ప్రతిభావంతులకు ప్రముఖ మాజీ క్రీడాకారుల ఆధ్వర్యంలో శిక్షణ శిబిరాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపికదారులు సాయి కార్తీక్‌రావు, విజయ్‌రాజు, ప్రశాంత్‌రెడ్డి, హరినాథ్‌రెడ్డి, గ్రామీణ క్రీడల సమన్వయకర్త కె.ప్రవీణ్, శిక్షకులు ఇనైతుల్లా, రఫీ, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.