BREAKING
ఓటీటీకి వచ్చేసిన మలయాళ సెన్సేషనల్ క్రైమ్ థ్రిల్లర్... బాక్సాఫీస్ వద్ద రూ.50 కోట్లు వసూలు చేసిన సినిమా స్ట్రీమింగ్ ఎప్పుడంటే కూటమి హామీలన్నీ నీటి మూటలే.. ప్రజలకు వాస్తవాలు వివరించాలి. స్థానిక ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలి: తన్నీరు నాగేశ్వరరావు పార్టీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ దేవర చుట్టమల్లే ఏఐ మార్ఫింగ్ వీడియోపై కుష్బూ సుందర్ తీవ్ర ఆగ్రహం.. మహిళల గౌరవం ఆటవస్తువు కాదంటూ ఘాటు వ్యాఖ్యలు ఎన్నికల సంఘం స్వతంత్ర తను కాపాడా లి ఎస్ ఐ ఆర్ ప్రక్రియ ను నిలిపివేయాలి... సీపీఐ - సిపిఎం… ఎన్నికల సంఘం స్వతంత్రతను కాపాడాలి నేడు గార్లకు రానున్న ఎమ్మెల్యే కోరం కనకయ్య కార్నెల్ విశ్వవిద్యాలయ సామూహిక అత్యాచార బాధితురాలికి బెదిరింపులు రెడ్‌క్రాస్‌ జిల్లా చైర్మన్‌గా డాక్టర్‌ ఎస్‌.ఎం. రాజేశ్వర్‌రావు స్థానిక ఎన్నికలకు వైఎస్సార్‌సీపీ సన్నద్ధం పెనుగంచిప్రోలులో పార్టీ శ్రేణులకు సభ్యత్వ కార్డుల పంపిణీ ఏఐ మార్ఫింగ్ వీడియోలపై జాన్వీ కపూర్ ఆవేదన: అనుమతి లేకుండా మహిళల చిత్రాలతో కల్పిత కంటెంట్ లైంగిక దాడికి సమానమని వ్యాఖ్య, ఎన్టీఆర్, చిరంజీవికి కృతజ్ఞతలు రాంపల్లి మరో జవహర్‌నగర్‌గా మారొద్దు.. ! సెంట్రల్ అమెరికన్ పార్లమెంట్ నుంచి తప్పుకుంటున్నట్లు నికరాగ్వా సంచలన ప్రకటన బీసీల హక్కుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది... నాగండ్లలో నేత్రదానం కుమ్మరి సంఘ భవన నిర్మాణానికి సంపూర్ణ సహకారం అందజేస్తాము* నాగండ్ల లో నేత్రదానం

మృతులకుటుంబాలకు కంచి పరమేశ్వర రెడ్డి 80వేల ఆర్థిక సాయం

Select Suryaa Now
మృతులకుటుంబాలకు కంచి పరమేశ్వర రెడ్డి 80వేల ఆర్థిక సాయం

మృతుల కుటుంబాలకు కంచి పరమేశ్వర రెడ్డి   80,000ఆర్థిక సాయం 
ఆత్మకూరు, మేజర్ న్యూస్, సోమా వెంకటసుబ్బయ్య :
శ్రీ సాంబశివ చారిటబుల్ ట్రస్ట్ అధినేత, నిత్యాన్నదాత కంచి పరమేశ్వర రెడ్డి ఆదివారం తన ఉదారతను చాటుకున్నారు. ఇటీవల మృతి చెందిన 8మంది కుటుంబాలకు 10వేల వంతున 80వేల రూపాయల ఆర్ధిక సాయమందించారు.మున్సిపాలిటీకే పరిమితమైన అంత్యక్రియల ఆర్థిక సహాయాన్ని ఇప్పుడు ఆత్మకూరు మండలంలోని రూరల్ గ్రామాలకు కూడా విస్తరించి, పేద కుటుంబాలకు ఆయన అండగా నిలుస్తున్నారు.ఆదివారం 
మొత్తం 8 కుటుంబాలకు రూ. 10,000 చొప్పున,  80,000ఆర్థిక సహాయాన్ని చెక్కుల రూపంలో కంచి నేరుగా అందజేశారు.
గ్రామీణ ప్రాంతం లోని 
నలపరెడ్డి పల్లి ఎస్సీ కాలనీకి చెందిన రామాంజపల్లి కుటుంబాన్ని,బండారుపల్లి ఎస్సీ కాలనీకి చెందిన కటారి సుబ్బయ్య కుటుంబాన్ని,
పమిడిపాడు గ్రామానికి చెందిన పెనుబాల రమణయ్య కుటుంబాన్ని,
ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని7 వ వార్డు తూర్పు వీధికి చెందిన నాగులపాటి జనార్ధన్ కుటుంబాన్ని,
18 వ వార్డు వందురుగుంట ప్రాంతానికి చెందిన కోటకొండ లక్ష్మమ్మ కుటుంబాన్ని,
18 వ వార్డు ఏకలవ్య నగర్ ప్రాంతానికి చెందిన పల్లవోలు రత్నమ్మ  కుటుంబాన్ని,
19వ వార్డు ఏసీఎస్సార్ కాలనీకి చెందిన యద్దనపూడి పెంచలయ్య కుటుంబాన్ని,
22వ వార్డు వీవర్స్ కాలనీకి చెందిన సోమ సుబ్బమ్మ కుటుంబ సభ్యులను పరమేశ్వర రెడ్డి పరామర్శించి వారికి ఆర్థిక సహాయాన్ని అందజేయడం జరిగింది. గత రెండేళ్లుగా పట్టణ ప్రాంతానికే పరిమితమైన ఈ సేవను గ్రామాల్లోని పేదల కష్టాలను గుర్తించి మండల వ్యాప్తంగా అమలు చేస్తున్నారు.
ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు, వారి సహాయకులకు నిరంతర అన్నదాన కార్యక్రమం ద్వారా వేలమంది ఆకలి తీరుస్తున్నారు.
కులమతాలకు అతీతంగా పేదరికమే ప్రాతిపదికగా, ఎటువంటి భేదాలు లేకుండా ప్రతి గడపకు వెళ్లి పరామర్శిస్తూ ధైర్యాన్ని నింపుతున్నారు.
ఆర్థిక ఇబ్బందుల వల్ల ఎవరూ తమ వారి అంత్యక్రియలకు ఇబ్బంది పడకూడదనేదే తన సంకల్పమని కంచి పరమేశ్వర రెడ్డి చెబుతున్నారు. ఆయనకు సాయం పొందిన కుటుంబాలవారు పరమేశ్వర రెడ్డి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ప్రతినిధి మల్లవరపు జయంద్ర ప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.