BREAKING
ఓటీటీకి వచ్చేసిన మలయాళ సెన్సేషనల్ క్రైమ్ థ్రిల్లర్... బాక్సాఫీస్ వద్ద రూ.50 కోట్లు వసూలు చేసిన సినిమా స్ట్రీమింగ్ ఎప్పుడంటే కూటమి హామీలన్నీ నీటి మూటలే.. ప్రజలకు వాస్తవాలు వివరించాలి. స్థానిక ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలి: తన్నీరు నాగేశ్వరరావు పార్టీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ దేవర చుట్టమల్లే ఏఐ మార్ఫింగ్ వీడియోపై కుష్బూ సుందర్ తీవ్ర ఆగ్రహం.. మహిళల గౌరవం ఆటవస్తువు కాదంటూ ఘాటు వ్యాఖ్యలు ఎన్నికల సంఘం స్వతంత్ర తను కాపాడా లి ఎస్ ఐ ఆర్ ప్రక్రియ ను నిలిపివేయాలి... సీపీఐ - సిపిఎం… ఎన్నికల సంఘం స్వతంత్రతను కాపాడాలి నేడు గార్లకు రానున్న ఎమ్మెల్యే కోరం కనకయ్య కార్నెల్ విశ్వవిద్యాలయ సామూహిక అత్యాచార బాధితురాలికి బెదిరింపులు రెడ్‌క్రాస్‌ జిల్లా చైర్మన్‌గా డాక్టర్‌ ఎస్‌.ఎం. రాజేశ్వర్‌రావు స్థానిక ఎన్నికలకు వైఎస్సార్‌సీపీ సన్నద్ధం పెనుగంచిప్రోలులో పార్టీ శ్రేణులకు సభ్యత్వ కార్డుల పంపిణీ ఏఐ మార్ఫింగ్ వీడియోలపై జాన్వీ కపూర్ ఆవేదన: అనుమతి లేకుండా మహిళల చిత్రాలతో కల్పిత కంటెంట్ లైంగిక దాడికి సమానమని వ్యాఖ్య, ఎన్టీఆర్, చిరంజీవికి కృతజ్ఞతలు రాంపల్లి మరో జవహర్‌నగర్‌గా మారొద్దు.. ! సెంట్రల్ అమెరికన్ పార్లమెంట్ నుంచి తప్పుకుంటున్నట్లు నికరాగ్వా సంచలన ప్రకటన బీసీల హక్కుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది... నాగండ్లలో నేత్రదానం కుమ్మరి సంఘ భవన నిర్మాణానికి సంపూర్ణ సహకారం అందజేస్తాము* నాగండ్ల లో నేత్రదానం

టోల్‌ ప్లాజా వద్ద టిప్పర్ల అడ్డగింత.. ఉద్రిక్తత.

Select Suryaa Now
టోల్‌ ప్లాజా వద్ద టిప్పర్ల అడ్డగింత.. ఉద్రిక్తత.

గన్నవరం, అక్టోబర్ 4 మేజర్ న్యూస్ ప్రతినిధి. (గుర్రం ప్రసాద్).

కృష్ణా జిల్లా, గన్నవరం మండలం, వెదురు పావులూరు టోల్‌ ప్లాజా వద్ద ఆదివారం టిప్పర్‌ లారీల అడ్డగింతతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. ఏలూరు నుంచి గుంటూరు వైపు వెళ్లే మార్గంలోని ఆరు టోల్‌ గేట్లకు అడ్డంగా సుమారు 20 టిప్పర్‌ లారీలు నిలిపివేశారు. టోల్‌ రుసుము చెల్లించిన తర్వాతే లారీలను అనుమతిస్తామని టోల్‌ ప్లాజా సిబ్బంది స్పష్టం చేశారు. దీనిపై డ్రైవర్లు స్పందిస్తూ.. ప్రభుత్వ ప్రాజెక్టు పనుల కోసం మట్టిని తరలిస్తున్నామని తెలిపారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న గన్నవరం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. టోల్‌ రుసుము చెల్లించి, సంబంధిత సంస్థ నుంచి ఆ మొత్తాన్ని వసూలు చేసుకోవాలని డ్రైవర్లకు సూచించారు.