కురుగుంట అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ఉచిత కంటి వైద్య శిబిరం
అనంతపురం బ్యూరో : కురుగుంట డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గురుకుల పాఠశాలలో పేరెంట్స్ కమిటీ ఆధ్వర్యంలో, ప్రిన్సిపల్ ఎన్. సునీత సహకారంతో డాక్టర్ అగర్వాల్ కంటి ఆసుపత్రి వైద్య బృందం ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించింది. ఈ శిబిరంలో విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించి, కంటి ఆరోగ్యంపై వైద్య సలహాలు అందించారు.
విద్యార్థుల ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతూ శిబిరం నిర్వహించిన వైద్య బృందానికి పేరెంట్స్ కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ చైర్మన్ నేరమెట్ల ఎల్లన్న, సభ్యులు మీనుగా రామాంజనేయులు, గోపాల్, ప్రిన్సిపల్ సునీత, వైస్ ప్రిన్సిపల్ విజయ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.