BREAKING
97 కేజీల విభాగంలో కాంస్యం గెలుచుకున్న దీపక్ పునియా పేదరిక నిర్మూలన, ఆర్థిక అసమానతలను తగ్గించడమే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలి* *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి* ఓటీటీలోకి వస్తోన్న ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్.. పరిణీతి చోప్రా ‘రిపోర్టింగ్ లైవ్’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే? ఆసియా క్రీడల్లో అద్భుత ప్రదర్శన చంద్రబాబు ప్రభుత్వానికి రైతులపై కపట ప్రేమ,,ప్రీమియం కట్టించుకొని కరువు మండలాలను ఎందుకు గుర్తించలేదు  .. వైకాపా ఇన్చార్జి రాజీవ్ రెడ్డి  మర్పల్లిలో గంజాయి కలకలం.. అనంతగిరి ఘాట్ రోడ్డు బస్సు ప్రమాద బాధితులను పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు, కాట శ్రీనివాస్ గౌడ్. దేశ రాజధానిలో తీవ్ర ఉద్రిక్తత...జెన్-జీ ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు పుట్టినరోజున హీరోయిన్‌కు ఊహించని షాక్.. అభిమాని అతి ప్రవర్తనపై నెటిజన్ల ఫైర్ పల్లెల్లో ఇక మెరుగైన వైద్యం ఏపీని టెక్నాలజీ హబ్‌గా మార్చడమే లక్ష్యం ఇది కలలో కూడా ఊహించలేదు: డొరొతీ సినిమాపై హీరోయిన్ కీర్తి సురేష్ ఆసక్తికర వ్యాఖ్యలు అభివృద్ధికి ఆ గోల్డెన్ డికేడ్.. ఏపీనే మోడల్!” ఆసియా క్రీడల్లో టీమిండియాకు స్వర్ణం సీఎం చంద్రబాబు, నారా లోకేశ్ అభినందనలు పాచలవలస గ్రామంలో పల్లె పండుగ 3.0- ముఖ్య అతిథిగా మంత్రి

కాలు కోల్పోయిన కూలికి మానవతా హస్తం

Select Suryaa Now
కాలు కోల్పోయిన కూలికి మానవతా హస్తం

రూ.65 వేల కృత్రిమ కాలు అందజేత.
వెంకటాపురం నూగూరు, అక్టోబర్ 02, మేజర్ న్యూస్ సూర్య:కర్రేగుట్ట అటవీ ప్రాంతంలో ల్యాండ్‌మైన్ ప్రమాదంలో కాలు కోల్పోయి రెండేళ్లుగా ఉపాధి లేక అల్లాడుతున్న వెంకటాపురం మండలం ఇప్పగూడెం గ్రామానికి చెందిన బొగ్గుల కృష్ణకు కాఫెడ్ సంస్థ,వైరా ఎస్ఐ పి.రామారావు,దాత శ్రీనివాసరావు సంయుక్తంగా రూ.65 వేల విలువైన కృత్రిమ కాలును అమర్చి మానవత్వం చాటారు.వివరాల్లోకి వెళ్తే... ఇప్పగూడెం గ్రామానికి చెందిన కృష్ణ రెండేళ్ల క్రితం కర్రేగుట్టకు వెళ్లినప్పుడు ల్యాండ్‌మైన్ పేలి కాలు కోల్పోయాడు.అప్పటి నుంచి నడవలేక కూలీ పనులకు వెళ్లలేకపోతున్నాడు. ముగ్గురు పిల్లలతో కుటుంబ పోషణ భారమంతా భార్యపై పడింది.ఈ విషయాన్ని కాఫెడ్ యానిమేటర్లు స్వరూప, పద్మ గుర్తించి వైరా ఎస్ఐ పి.రామారావు దృష్టికి తీసుకెళ్లారు. సామాజిక  సేవలో ముందుండే రామారావు వెంటనే స్పందించి ధాత శ్రీనివాసరావు సహకారంతో బాధితుడికి అండగా నిలిచారు.  విజయవాడలో కృత్రిమ కాలు అమర్చచారు.ఆ కుటుంబానికి ఆసరా అయ్యారు.
కృత్రిమ కాలు అందుకున్న కృష్ణ మాట్లాడుతూ తనకు అండగా నిలిచిన అందరికీ కృతజ్ఞతలు తెలిపాడు. కాఫెడ్ డైరెక్టర్ బ్రదర్ కె.లూర్దురాజు మాట్లాడుతూ.. వెనుకబడిన కుటుంబాలకు అండగా నిలవడం తమ సంస్థ బాధ్యత అని, ఇలాంటి దాతల సహకారం సమాజానికి స్ఫూర్తిదాయకమని అన్నారు.