చంద్రబాబు ప్రభుత్వానికి రైతులపై కపట ప్రేమ,,ప్రీమియం కట్టించుకొని కరువు మండలాలను ఎందుకు గుర్తించలేదు .. వైకాపా ఇన్చార్జి రాజీవ్ రెడ్డి
ఎమ్మిగనూరు సూర్య ప్రతినిధ;చంద్రబాబు నాయుడు పాలనలో ఎప్పుడు చూసినా రైతులపై చిన్నచూపు చూస్తారని ఎమ్మిగనూరు వైకాపా ఇన్చార్జి రాజీవ్ రెడ్డి పేర్కొన్నారు శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎల్నినో ప్రభావంతో రాష్ట్రమంతా కరువు చాయలు అలముకుంటే అన్ని మండలాలను కరువు మండలగా ప్రకటించేది పోయి ఇష్టానుసారంగా కరువును ప్రకటించారని దుయ్యబడ్డారు. కర్నూలు జిల్లాలో 100 కోట్ల రూపాయలు పంటల బీమా ప్రీమియం వసూలు చేసుకుని కేవలం 15 మండలాల్లో కరువు ఉన్నట్లు ప్రకటించడం చూస్తుంటే చంద్రబాబు ప్రభుత్వం దోపిడీ ప్రభుత్వం కాదా అంటూ ప్రశ్నించారు. రైతులు అప్పుల ఊబిలో ఉన్న కూడా మరీ అప్పులు చేసే పంటల బీమా ప్రీమియాన్ని చెల్లించాలని గుర్తు చేశారు. స్థానిక ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి పల్లె పండుగ అంటూ రోజు గ్రామాలు పట్టుకుని తిరుగుతున్నారు రైతుల కష్టాలు ఆయనకు కళ్ళకు కనిపించడం లేదా అంటూ ఏద్దేవా చేశారు.. రైతులను విస్మరిస్తే ఎమ్మిగనూరు ప్రాంతంలో బివి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. రైతుల పక్షాన వైకాపా పోరాటం చేస్తుందని అవసరమైతే కరువు మండల కోసం రిలే నిరాహార దీక్షలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో వైకాపా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు