BREAKING
పల్లెల్లో ఇక మెరుగైన వైద్యం ఏపీని టెక్నాలజీ హబ్‌గా మార్చడమే లక్ష్యం ఇది కలలో కూడా ఊహించలేదు: డొరొతీ సినిమాపై హీరోయిన్ కీర్తి సురేష్ ఆసక్తికర వ్యాఖ్యలు అభివృద్ధికి ఆ గోల్డెన్ డికేడ్.. ఏపీనే మోడల్!” ఆసియా క్రీడల్లో టీమిండియాకు స్వర్ణం సీఎం చంద్రబాబు, నారా లోకేశ్ అభినందనలు పాచలవలస గ్రామంలో పల్లె పండుగ 3.0- ముఖ్య అతిథిగా మంత్రి రూటు మార్చిన జగన్-స్థానిక పోరులో సరికొత్త స్కెచ్! -ఇక సిఫార్సులకు NO.. సర్వేలకే YES - గెలుపు గుర్రాలకే టికెట్! మేయర్, మున్సిపల్ చైర్మన్ సీట్లకు 3 పేర్ల ప్యానల్ ఫార్ములా! నకిలీ పత్రాలతో భూకబ్జాయత్నం అదృశ్యమైన వివాహిత మహిళ హత్య జైనూర్ సర్కిల్ పరిధిలో వాలీబాల్ టోర్నమెంట్ నువ్వే నువ్వే సినిమాలో పాట పాడటానికి అసలు కారణం అదే: స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ ఆసక్తికర వ్యాఖ్యలు రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు పకడ్బందీ ఏర్పాట్లు బిగ్‌బాస్ 10 హౌస్‌లో నాలుగో వారం ఎలిమినేషన్ హీట్.. డేంజర్ జోన్‌లో ఆ ఇద్దరు కంటెస్టెంట్లు ప్రాజెక్ట్ డైరెక్టర్‌కు ‘వి బి జి రామ్ జి’ సిబ్బంది వినతి: జీతాలు పెంచాలని డిమాండ్ *గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !* *విలేకరుల సమావేశంలో మధిర తాసిల్దార్ రాళ్ల బండి రాంబాబు -*

హోంమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యేలు ఎం.ఎస్. రాజు, బండారు శ్రావణి

Select Suryaa Now
హోంమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యేలు ఎం.ఎస్. రాజు, బండారు శ్రావణి

అనంతపురం బ్యూరో : శింగనమల నియోజకవర్గ పరిధిలోని అలంకారాయునిపేట గ్రామానికి ఈ నెల 5వ తేదీన రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత రానున్న నేపథ్యంలో పర్యటన ఏర్పాట్లను మడకశిర ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజు, శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి, జిల్లా ఎస్పీ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

మంత్రి పర్యటనలో భాగంగా గ్రామంలో నిర్మించిన సీసీ రోడ్డు, వాటర్ ట్యాంక్, బస్టాండ్‌ను ప్రారంభించడంతో పాటు నూతన బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమానికి పలువురు మంత్రులు కూడా హాజరుకానున్నారు.

ఈ నేపథ్యంలో సభా ప్రాంగణం, హెలిప్యాడ్, వాహనాల పార్కింగ్ స్థలాలను స్థానిక అధికారులతో కలిసి ఎమ్మెల్యేలు, జిల్లా ఎస్పీ పరిశీలించారు. కార్యక్రమంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లు పక్కాగా చేపట్టాలని అధికారులకు సూచించారు. భద్రతా చర్యల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి మంత్రి పర్యటనను సజావుగా నిర్వహించాలని ఆదేశించారు.