BREAKING
ఐజేయు ఆధ్వర్యంలో జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి నిత్యజీవితంలో గాంధీ ఆశయాలు ఆచరించాలి గుడ్ల సరఫరా కొనుగోలుపై కలెక్టర్ కార్యాలయంలో టెండర్ పాల్గొన్న జెసి గుత్తి కోటలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ భూమి పూజ పాల్గొన్న గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మంచి వాళ్ళ గుండెల్లో మహాత్ముడు చిరస్మరణీయం..*మాజీ టౌను అధ్యక్షుడు సత్యవరపు సంపూర్ణం కామారెడ్డి నిజాంసాగర్ చౌరస్తాలో చెన్నై షాపింగ్ మాల్, కిసాన్ షాపింగ్ మాల్ ప్రారంభించిన ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ మర్పల్లిలో రూ.71 లక్షలతో ఎస్సీ షాపింగ్‌ కాంప్లెక్స్‌ శ్రీ వరసిద్ధి వినాయక ఆటో డ్రైవర్స్, ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్‌ నూతన కార్యవర్గ సభ్యులకు వైసీపీ సీనియర్ నేత సిద్ధిగుంట సుధాకర్ రెడ్డి అభినందనలు మహాత్మ గాంధీ మరియు లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి వేడుకలు ఖానాపురంలో ఘనంగా గాంధీజీ జయంతి వేడుకలు కరువు రైతులకు నష్టపరిహారం చెల్లించాలి చేతిలో చీపురు.. పరిశుభ్రతపై పిలుపు - బస్టాండ్‌లో ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు శ్రమదానం.. మొక్కలు నాటి, ప్రయాణికులకు పండ్ల పంపిణీ గాయపడ్డ సీనియర్ కెమెరామెన్ మురళికి వైఎస్ఆర్‌సీపీ నేతల పరామర్శ, రాజమండ్రి రూరల్‌లో ఆత్మీయ భరోసా ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించాలి ప్రభాస్ 'ఫౌజీ' మూవీ ఆలస్యం కావడానికి అసలు కారణం అదే.. నటుడు జితిన్ గులాటి ఆసక్తికర వ్యాఖ్యలు!

ముల్కనూరు సహకార ప్రస్థానంపై విదేశీ ప్రతినిధుల ఆసక్తి

Select Suryaa Now
ముల్కనూరు సహకార ప్రస్థానంపై విదేశీ ప్రతినిధుల ఆసక్తి

ముల్కనూర్‌ సహకార ప్రస్థానంపై విదేశీ ప్రతినిధుల ఆసక్తి

ఎంసిఆర్బి ని పరిశీలించిన 18 దేశాల బృందం

భీమదేవరపల్లి, అక్టోబర్ 02(మేజర్ న్యూస్ సూర్య):

భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఐటీఈసీ కార్యక్రమంలో శిక్షణ పొందుతున్న 18 దేశాలకు చెందిన అధికారులు, జర్నలిస్టులు శుక్రవారం ముల్కనూర్‌ సహకార గ్రామీణ పరపతి, మార్కెటింగ్‌ సంఘాన్ని సందర్శించారు. డా. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న శిక్షణలో భాగంగా ఈ పర్యటన చేపట్టారు. ఈ సందర్భంగా మహాత్మాగాంధీ చిత్రపటానికి నివాళులర్పించి, జాతీయ గీతాలాపనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. సంఘం అధ్యక్షుడు అలిగిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా సంఘం ఆవిర్భావం, అభివృద్ధి, రైతులకు అందిస్తున్న సేవలను వివరించారు. అనంతరం ప్రతినిధులు వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ, ప్రాసెసింగ్‌, విలువ జోడింపు విభాగాలను పరిశీలించారు. తర్వాత ముల్కనూర్‌ మహిళా సహకార డెయిరీని సందర్శించారు. డెయిరీ జీఎం మార్పాటి భాస్కర్‌రెడ్డి పాల సేకరణ, ప్రాసెసింగ్‌, నాణ్యత నియంత్రణ, మార్కెటింగ్‌ విధానాలను వివరించారు. గ్రామీణ మహిళల ఆర్థిక సాధికారతలో డెయిరీ పాత్రను ప్రతినిధులు అభినందించారు. రైతుల భాగస్వామ్యం, పరస్పర విశ్వాసంతో ముల్కనూర్‌ సహకార సంఘం ఎదిగిన తీరు స్ఫూర్తిదాయకమని వారు పేర్కొన్నారు.