నిత్యజీవితంలో గాంధీ ఆశయాలు ఆచరించాలి
పద్మావతి మహిళా వర్సిటీలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం జరిగిన కార్యక్రమానికి వర్సిటీ వైస్ ఛాన్సలర్ సిబ్బందితో కలిసి గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశానికి ఆయన అందించిన అమూల్యమైన సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆమె మాట్లాడుతూ"లివ్ టుడే యాస్ ఇఫ్ యూ డై టుమారో - లెర్న్ టుడే యాస్ ఇఫ్ యూ లివ్ ఫర్ ఎవర్"_ అనే సందేశాన్ని అందించారు. మహాత్మా గాంధీకి మనం అందించే నిజమైన నివాళి ఆయన సిద్ధాంతాల గురించి మాట్లాడటంలోనే కాకుండా, వాటిని మన నిత్యజీవితంలో ఆచరించడంలో ఉందని స్పష్టం చేశారు. సత్యం, అహింస, నిరాడంబరత, క్రమశిక్షణ, సేవాభావం వంటి గాంధేయ విలువలను విద్యార్థులు తమ జీవితాల్లో అలవరచుకోవాలని సూచించారు.గాంధీ జయంతి వేడుకల్లో భాగంగా, విద్యార్థి వ్యవహారాల డీన్ ప్రొ.మద్దూరు నీరజా ఆధ్వర్యంలో మీ నాయకుడును తెలుసుకోండిఅనే అంశంపై పోటీ నిర్వహించారు. మహాత్మా గాంధీ జీవితం, నాయకత్వ లక్షణాలు, ఆదర్శాలు, భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ఆయన చేసిన విశిష్ట కృషి గురించి విద్యార్థులకు అవగాహన కల్పించడం ఈ పోటీ ముఖ్య ఉద్దేశ్యం. ఈ పోటీలో ప్రతిభ కనబరిచిన షేక్ మౌయా, కౌశాలి, ధాత్రిలకు బహుమతులు అందజేశారు. విద్యార్థి వ్యవహారాల విభాగం డీన్ ప్రొఫెసర్ మద్దూరు నీరజ, డీన్లు ప్రొఫెసర్ విజయలక్ష్మి, ప్రొఫెసర్ సుధ, డాక్టర్ గంగాభవాని, బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
సీఎం గౌడ్ తిరుపతిప్రచురి