BREAKING
ఐజేయు ఆధ్వర్యంలో జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి నిత్యజీవితంలో గాంధీ ఆశయాలు ఆచరించాలి గుడ్ల సరఫరా కొనుగోలుపై కలెక్టర్ కార్యాలయంలో టెండర్ పాల్గొన్న జెసి గుత్తి కోటలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ భూమి పూజ పాల్గొన్న గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మంచి వాళ్ళ గుండెల్లో మహాత్ముడు చిరస్మరణీయం..*మాజీ టౌను అధ్యక్షుడు సత్యవరపు సంపూర్ణం కామారెడ్డి నిజాంసాగర్ చౌరస్తాలో చెన్నై షాపింగ్ మాల్, కిసాన్ షాపింగ్ మాల్ ప్రారంభించిన ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ మర్పల్లిలో రూ.71 లక్షలతో ఎస్సీ షాపింగ్‌ కాంప్లెక్స్‌ శ్రీ వరసిద్ధి వినాయక ఆటో డ్రైవర్స్, ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్‌ నూతన కార్యవర్గ సభ్యులకు వైసీపీ సీనియర్ నేత సిద్ధిగుంట సుధాకర్ రెడ్డి అభినందనలు మహాత్మ గాంధీ మరియు లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి వేడుకలు ఖానాపురంలో ఘనంగా గాంధీజీ జయంతి వేడుకలు కరువు రైతులకు నష్టపరిహారం చెల్లించాలి చేతిలో చీపురు.. పరిశుభ్రతపై పిలుపు - బస్టాండ్‌లో ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు శ్రమదానం.. మొక్కలు నాటి, ప్రయాణికులకు పండ్ల పంపిణీ గాయపడ్డ సీనియర్ కెమెరామెన్ మురళికి వైఎస్ఆర్‌సీపీ నేతల పరామర్శ, రాజమండ్రి రూరల్‌లో ఆత్మీయ భరోసా ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించాలి ప్రభాస్ 'ఫౌజీ' మూవీ ఆలస్యం కావడానికి అసలు కారణం అదే.. నటుడు జితిన్ గులాటి ఆసక్తికర వ్యాఖ్యలు!

పలువురిని పరామర్శించిన కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్

Select Suryaa Now
పలువురిని పరామర్శించిన కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్


సూర్య వీణవంక: కేంద్ర సహాయ మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు బండి సంజయ్ కుమార్ శుక్రవారం వీణవంక మండలంలో పర్యటించి పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు, బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయంగా మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
వీణవంక మండలంలోని నర్సింగాపూర్ గ్రామానికి చెందిన బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి మడుగురి సమ్మిరెడ్డి ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన విషయం తెలుసుకున్న బండి సంజయ్ కుమార్ ఆయనను పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరును, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితిని కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా సమ్మిరెడ్డి కుటుంబ సభ్యులతో కొద్దిసేపు మాట్లాడి ధైర్యం చెప్పారు.
అనంతరం వీణవంక మండల కేంద్రానికి చెందిన వేద పండితులు గూడ జగదీశ్వర్ శర్మ కుమార్తె ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో వారి నివాసానికి వెళ్లిన బండి సంజయ్ కుమార్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. విషాద సమయంలో కుటుంబ సభ్యులకు ధైర్యంగా ఉండాలని సూచించారు.తదుపరి వీణవంకకు చెందిన వ్యాపారవేత్త, సీనియర్ బీజేపీ నాయకుడు అయిత రాంబాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తేనేటి విందులో బండి సంజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఆత్మీయ స్వాగతం పలికారు. నాయకులు, కార్యకర్తలతో కలిసి కొంతసేపు ఆత్మీయంగా గడిపారు.అనంతరం బండి సంజయ్ కుమార్ పార్టీ నాయకులు,  సూచించారు. పార్టీని గ్రామస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు.