షాద్‌నగర్ కమ్యూనిటీ ఆసుపత్రిలో ఒకే రోజులో 10 సాధారణ ప్రసవాలు..
షాద్‌నగర్ మెడికల్ సూపరింటెండెంట్ విష్ణు వర్ధన్…
షాద్‌నగర్‌లోని సామాజిక ఆరోగ్య కేంద్రం (కమ్యూనిటీ హెల్త్ సెంటర్)లో వైద్యాధికారులు, క్లినికల్ సిబ్బంది ఒకే రోజులో ఎటువంటి సంక్లిష్టతలు లేకుండా 10 విజయవంతమైన సాధారణ ప్రసవాలు నిర్వహించి రికార్డు సాధించారు. జన్మించిన నవజాత శిశువులు, తల్లులందరూ సురక్షితంగా, ఆరోగ్యంగా ఉన్నారు. ఈ సందర్భంగా మెడికల్ సూపరింటెండెంట్ విష్ణు వర్ధన్ మాట్లాడుతూ రౌండ్-ది-క్లాక్ అంకితభావంతో సేవలందించిన మెడికల్ ఆఫీసర్లు, గైనకాలజిస్టులు, స్టాఫ్ నర్సులు, ఏఎన్‌ఎంలు, పారిశుధ్య సిబ్బందికి హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు తెలిపారు. 24 గంటల్లో 10 సాధారణ ప్రసవాలు నిర్వహించడం ప్రభుత్వ వైద్య సేవలపై ప్రజలకు ఉన్న నమ్మకానికి నిదర్శనమని పేర్కొన్నారు. సాధారణ ప్రసవాలకు ప్రాధాన్యత ఇవ్వడం, అనవసరమైన సి-సెక్షన్లను తగ్గించడం, గర్భిణీ స్త్రీలకు ఉచితంగా నాణ్యమైన, సురక్షితమైన వైద్య సేవలు అందించడమే తమ ముఖ్య లక్ష్యమని తెలిపారు..
M. నరసింహ రెడ్డి మేజర్ న్యూస్ ఫరూక్ నగర్….