జేఎన్‌టీయూఏలో గాంధీ, శాస్త్రి జయంతి వేడుకలు
(మల్లికార్జున నేటి దినపత్రిక సూర్య స్టాఫ్ రిపోర్టర్)
జేఎన్‌టీయూ అనంతపురం విశ్వవిద్యాలయంలో మహాత్మా గాంధీ, లాల్‌బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలను శుక్రవారం పరిపాలనా భవనంలో నిర్వహించారు. గాంధీజీ, శాస్త్రి చిత్రపటాలకు ఉపకులపతి ఆచార్య హెచ్. సుదర్శనరావు, రిజిస్ట్రార్ ఆచార్య బి. దుర్గాప్రసాద్, ఓఎస్‌డీ ఆచార్య ఎన్. దేవన్నతో పాటు అధికారులు, సిబ్బంది పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఉపకులపతి మాట్లాడుతూ గాంధీజీ అహింస, సత్యాగ్రహం ద్వారా స్వాతంత్ర్య ఉద్యమాన్ని ముందుకు నడిపారని, ఆయన వ్యక్తిత్వం, సమయపాలన, నైతిక విలువలను ప్రతి ఒక్కరూ అలవరచుకోవాలని సూచించారు. గాంధీ, శాస్త్రి ఆశయాలను యువతకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు.
రిజిస్ట్రార్ మాట్లాడుతూ స్వాతంత్ర్య ఉద్యమంలో లాల్‌బహదూర్ శాస్త్రి కీలక పాత్ర పోషించారని తెలిపారు. అనంతరం జేఎన్‌టీయూఏ ఇంజినీరింగ్ కళాశాల, ఓటీపీఆర్‌ఐ అనుబంధ కళాశాలలోనూ గాంధీ, శాస్త్రి జయంతి వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో విశ్వవిద్యాలయ డైరెక్టర్లు, అధికారులు, బోధన, బోధనేతర, ఔట్‌సోర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు.