ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్‌కు రూ.1.02 కోట్ల విరాళం
టీటీడీ నిర్వహిస్తున్న ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్‌కు హైదరాబాద్‌కు చెందిన దాత నోముల అశోక్ కుమార్ రూ.1.02 కోట్ల విరాళాన్ని అందజేశారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని టీటీడీ క్యాంపు కార్యాలయంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును శుక్రవారం కలిసి ఈ విరాళాన్ని అందించారు.ఈ సందర్భంగా దాత నోముల అశోక్ కుమార్‌ను చైర్మన్ అభినందించారు. ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్ ద్వారా అందిస్తున్న సేవలకు సహకరిస్తున్న దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆశీస్సులు దాతకు, వారి కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.
సీఎం గౌడ్ తిరుపతి ప్రతినిధి