ఘనంగా నల్లా నరసింహులు శత జయంతి వేడుకలు
*నల్లా నర్సింహులు గారి శత జయంతి వేడుకలు మన ఆలోచన సాధన సమితి ఆధ్వర్యంలో ఘనంగా*
జనగామ జిల్లా. సూర్య ప్రతినిధి అక్టోబర్ 02 మేజర్ న్యూస్ ):-
జనగామ పట్టణంలో మన ఆలోచన సాధన సమితి (ఎంఏస్స్స్) ఆధ్వర్యంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు, తెలంగాణ టైగర్, అమరజీవి కామ్రేడ్ నల్లా నర్సింహులు గారి 100వ (శత) జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి.
జనగామలోని బతుకమ్మ కుంట రోడ్డులో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనగామ మున్సిపల్ ఛైర్ పర్సన్ కడకంచి బాలమణి శ్రీనివాస్ హాజరై, కామ్రేడ్ నల్లా నర్సింహులు గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఛైర్ పర్సన్ మాట్లాడుతూ..
ఒక సాధారణ చేనేత కుటుంబంలో జన్మించి, భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు నల్లా నర్సింహులు . నిజాం, రజాకార్ల, భూస్వాముల దోపిడీకి వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేసి, 'దున్నేవాడిదే భూమి' అనే నినాదాన్ని నిజం చేసిన వీరుడు. జైలు జీవితం, అజ్ఞాతవాసం, ఉరిశిక్షకు సిద్ధం చేసినా వెరవని ధీరుడు. ఆయన ఆశయాలను కొనసాగించడమే మనందరి బాధ్యత. ఇంత గొప్ప చరిత్రను నేటి తరానికి తెలియజేస్తూ శత జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్న మన ఆలోచన సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు కటకం నర్సింగ్ రావు గారికి, సభ్యులకు నా అభినందనలు" అని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంఏస్స్స్ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ కటకం నర్సింగ్ రావు , జయంతి ఉత్సవ కమిటి చైర్మన్ దోర్నాల వెంకటేశ్వర్లు ,నల్లా నర్సింహులు గారి కుటుంబ సభ్యులు నల్లా అరుణ , వివిధ ప్రజా సంఘాల నాయకులు, మేధావులు, కౌన్సిలర్లు, యువకులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.