బాపూజీ కలలుగన్న గ్రామస్వరాజ్యం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం
- కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సింగం రామకృష్ణారెడ్డి
మదనపల్లె, మేజర్ న్యూస్ : జాతిపిత మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామస్వరాజ్యం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సింగం రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.శుక్రవారం గాంధీ జయంతిని పురస్కరించుకొని మదనపల్లె జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు గల గాంధీజీ విగ్రహానికి ఆయన పూలమాల వేసి కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా సింగం రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఆంగ్లేయులు చెర నుండి భారతావనికి విముక్తి కల్పించడానికి సత్యం,అహింస మార్గాలను ఎన్నుకుని దేశ ప్రజలను జాగృతం చేసిన మహనీయుడని కొనియాడారు.ఆంగ్లేయులకు వ్యతిరేకంగా అనేక ఉద్యమాలను నడిపి జైలు జీవితాన్ని అనుభవించారన్నారు.అయినప్పటికీ మొక్కువోని విశ్వాసంతో ముందుకు సాగి దేశానికి స్వాతంత్రం సాధించడంలో కీలకపాత్ర పోషించారన్నారు.అదేవిధంగా భారత జాతీయ కాంగ్రెస్ నిర్మాణం,బలోపేతంలో గాంధీ పాత్ర అద్వితీయమని కొనియాడారు.మహాత్ముడి ఆశయసాధనకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కృషిచేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు చెన్నంశెట్టి సురేంద్ర బాబు,మంగూ నాయక్,ఎం.రెడ్డెప్ప,పవన్,సయ్యద్,కరీముల్లా తదితరులు పాల్గొన్నారు.