BREAKING
ఎన్టీఆర్ సామాజిక భరోసా పెన్షన్ల పంపిణీలో టౌన్ అధ్యక్షుడు గుమ్మడి సింహాద్రి.... ఐజేయు ఆధ్వర్యంలో జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి నిత్యజీవితంలో గాంధీ ఆశయాలు ఆచరించాలి గుడ్ల సరఫరా కొనుగోలుపై కలెక్టర్ కార్యాలయంలో టెండర్ పాల్గొన్న జెసి గుత్తి కోటలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ భూమి పూజ పాల్గొన్న గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మంచి వాళ్ళ గుండెల్లో మహాత్ముడు చిరస్మరణీయం..*మాజీ టౌను అధ్యక్షుడు సత్యవరపు సంపూర్ణం కామారెడ్డి నిజాంసాగర్ చౌరస్తాలో చెన్నై షాపింగ్ మాల్, కిసాన్ షాపింగ్ మాల్ ప్రారంభించిన ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ మర్పల్లిలో రూ.71 లక్షలతో ఎస్సీ షాపింగ్‌ కాంప్లెక్స్‌ శ్రీ వరసిద్ధి వినాయక ఆటో డ్రైవర్స్, ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్‌ నూతన కార్యవర్గ సభ్యులకు వైసీపీ సీనియర్ నేత సిద్ధిగుంట సుధాకర్ రెడ్డి అభినందనలు మహాత్మ గాంధీ మరియు లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి వేడుకలు ఖానాపురంలో ఘనంగా గాంధీజీ జయంతి వేడుకలు కరువు రైతులకు నష్టపరిహారం చెల్లించాలి చేతిలో చీపురు.. పరిశుభ్రతపై పిలుపు - బస్టాండ్‌లో ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు శ్రమదానం.. మొక్కలు నాటి, ప్రయాణికులకు పండ్ల పంపిణీ గాయపడ్డ సీనియర్ కెమెరామెన్ మురళికి వైఎస్ఆర్‌సీపీ నేతల పరామర్శ, రాజమండ్రి రూరల్‌లో ఆత్మీయ భరోసా ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించాలి

రంగన్నగూడెంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు. జాతిపితకు ఘన నివాళులర్పించిన ప్రజాప్రతినిధులు, టీడీపీ నేతలు..

Select Suryaa Now
రంగన్నగూడెంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు.  జాతిపితకు ఘన నివాళులర్పించిన ప్రజాప్రతినిధులు, టీడీపీ నేతలు..

బాపులపాడు, అక్టోబర్ 02, సూర్య ప్రతినిధి (గుర్రం ప్రసాద్).

జాతిపిత మహాత్మా గాంధీ 157వ జయంతి వేడుకలను బాపులపాడు మండలం రంగన్నగూడెం గ్రామంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. గన్నవరం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు సూచనల మేరకు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో గ్రామ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు ఆళ్ళ వెంకట గోపాలకృష్ణారావు మాట్లాడుతూ  గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు అన్న గాంధీజీ ఆశయాన్ని స్ఫూర్తిగా తీసుకుని గ్రామాభివృద్ధికి ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. రంగన్నగూడెం పంచాయతీ అభివృద్ధికి ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఇప్పటివరకు రూ.45 లక్షల నిధులు కేటాయించారని తెలిపారు. కార్యక్రమంలో పీఏసీఎస్ అధ్యక్షుడు కనకవల్లి శేషగిరిరావు, ఎంపీసీఎస్ అధ్యక్షుడు మొవ్వ శ్రీనివాసరావు, పంచాయతీ కార్యదర్శి పుట్టి కృష్ణకాంత్, మాజీ ఎంపీటీసీ సభ్యుడు పుసులూరు లక్ష్మీనారాయణ, గ్రామ ప్రముఖులు కసుకుర్తి వేణుబాబు, కాట్రు పాపారావు, కొలుసు గంగాజలం, కొమరపు సింహాచలం, ధర్మవరపు రమణ, ధర్మవరపు శ్రీనివాస్, దేవరకొండ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.