జడ్పీ హై స్కూల్ లో ఘనంగా గాంధీ జయంతివేడుకలు
తాడేపల్లిగూడెం, మేజర్ న్యూస్; తాడేపల్లిగూడెం లోని తేతలి సత్యనారాయణమూర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తొలుత జాతిపిత మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి విగ్రహాలకు ఏపీ గిరిజన సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు, మున్సిపల్ మాజీ కౌన్సిలర్ సింగం సుబ్బారావు, భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షుడు దువ్వా శ్రీను పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం సాధించేందుకు మహాత్మా గాంధీ, లాల్‌బహదూర్ శాస్త్రి వంటి మహనీయులు చేసిన సేవలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. వారి ఆశయాలను నేటి తరం ఆదర్శంగా తీసుకుని దేశాభివృద్ధికి పాటుపడాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మైనం సత్యనారాయణ, పాఠశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ నక్క అనురాధ, వైస్ చైర్మన్ చింతకాయల దొరబాబు, కమిటీ సభ్యులు, ఉపాధ్యాయులు, ఎన్‌సీసీ అధికారి గణపతి, విద్యార్థులు పాల్గొన్నారు.
శ్రీనివాస్ తాడేపల్లిగూడెం