BREAKING
ఐజేయు ఆధ్వర్యంలో జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి నిత్యజీవితంలో గాంధీ ఆశయాలు ఆచరించాలి గుడ్ల సరఫరా కొనుగోలుపై కలెక్టర్ కార్యాలయంలో టెండర్ పాల్గొన్న జెసి గుత్తి కోటలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ భూమి పూజ పాల్గొన్న గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మంచి వాళ్ళ గుండెల్లో మహాత్ముడు చిరస్మరణీయం..*మాజీ టౌను అధ్యక్షుడు సత్యవరపు సంపూర్ణం కామారెడ్డి నిజాంసాగర్ చౌరస్తాలో చెన్నై షాపింగ్ మాల్, కిసాన్ షాపింగ్ మాల్ ప్రారంభించిన ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ మర్పల్లిలో రూ.71 లక్షలతో ఎస్సీ షాపింగ్‌ కాంప్లెక్స్‌ శ్రీ వరసిద్ధి వినాయక ఆటో డ్రైవర్స్, ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్‌ నూతన కార్యవర్గ సభ్యులకు వైసీపీ సీనియర్ నేత సిద్ధిగుంట సుధాకర్ రెడ్డి అభినందనలు మహాత్మ గాంధీ మరియు లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి వేడుకలు ఖానాపురంలో ఘనంగా గాంధీజీ జయంతి వేడుకలు కరువు రైతులకు నష్టపరిహారం చెల్లించాలి చేతిలో చీపురు.. పరిశుభ్రతపై పిలుపు - బస్టాండ్‌లో ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు శ్రమదానం.. మొక్కలు నాటి, ప్రయాణికులకు పండ్ల పంపిణీ గాయపడ్డ సీనియర్ కెమెరామెన్ మురళికి వైఎస్ఆర్‌సీపీ నేతల పరామర్శ, రాజమండ్రి రూరల్‌లో ఆత్మీయ భరోసా ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించాలి ప్రభాస్ 'ఫౌజీ' మూవీ ఆలస్యం కావడానికి అసలు కారణం అదే.. నటుడు జితిన్ గులాటి ఆసక్తికర వ్యాఖ్యలు!

దేవాలయాల్లో వరుస చోరీలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్

Select Suryaa Now
దేవాలయాల్లో వరుస చోరీలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్


-రూ.1.65 లక్షల విలువైన ఆభరణాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు…


దేవాలయాలలో వరుస చోరీలకు పాల్పడుతున్న నాగర్ కర్నూల్ జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం గంటరావుపల్లి గ్రామానికి చెందిన పెద్ద ముక్కుల ఈశ్వర్ ను  అరెస్టు చేసినట్లు సీఐ వెంకటేశ్వర్లు చెప్పారు. నిందితుని నుండి 1. 65 లక్షల విలువ చేసే ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వివరించారు. శుక్రవారం ఆమనగల్లు పోలీస్ స్టేషన్ లో  ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత నెల 29న రాత్రి ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధిలోని విటాయిపల్లి గ్రామ సమీపంలోని హనుమాన్ ఆలయంతో పాటు పెద్దమ్మ దేవాలయంలో తాళాలు పగలగొట్టి బంగారు, వెండి, ఇత్తడి, రాగి వస్తువులు చోరీ కి పాల్పడినట్లు ఆలయ పూజారి సభావట్ లక్ష్మణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. విచారణలో భాగంగా సాంకేతిక ఆధారాలతో నిందితున్ని గుర్తించి అరెస్టు చేసినట్లు చెప్పారు. గతంలో నిందితుడు మున్సిపాలిటీ లోని దేవాలయాలతో పాటు పెద్ద కొత్తపల్లి, పాన్ గల్, గంట రావు పల్లి, కందుకూరు, కడ్తాల్ గ్రామాలలోని ఆలయాలలో చోరీ కి పాల్పడినట్లు విచారణలో వెల్లడైనట్లు ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు నిందితుని పై ఆయా పోలీస్ స్టేషన్లో కేసులు నమోదైనట్లు తెలిపారు. కేసును చాలెంజ్ గా తీసుకొని ఫ్యూచర్ సిటీ కమిషనర్ ఆదేశాల మేరకు  మహేశ్వరం డిసిపి నారాయణరెడ్డి, ఏసీపి జానకి రెడ్డి ల పర్యవేక్షణలో సీఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఏఎస్ఐ రామ్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ రాజేందర్, కానిస్టేబుల్లు శివకుమార్, మల్లయ్య లు చాకచక్యంగా వ్యవహరించి నిందితున్ని అరెస్టు చేసి చోరీ కి పాల్పడిన వస్తువులను సాధ్యం చేసుకున్నట్లు ఆయన వివరించారు. కేసు చేధన లో చాకచక్యంగా వ్యవహరించిన పోలీస్ అధికారి, సిబ్బందికి అవార్డులు అందజేయనున్నట్లు సీఐ వెంకటేశ్వర్లు చెప్పారు.
ఎ. చంద్రశేఖర్: మేజర్ న్యూస్, ఆమనగల్లు.